ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి..

ABN, First Publish Date - 2022-03-18T05:56:33+05:30

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేయూ వీసీ తాటికొండ రమేశ్‌

 ప్రారంభమైన వర్సిటీ సౌత్‌ జోన్‌ మహిళల ఖోఖో పోటీలు

కేయూ క్యాంపస్‌, మార్చి 17:  క్రీడా స్ఫూర్తితో యువత దేన్నైనా సాధించగలుగుతుందని, ఓటమి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ ఉద్బోధించారు. గురువారం కేయూ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో ఇంటర్‌ యూనివర్సిటీ సౌత్‌జోన్‌ మహిళల ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడామైదానంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బైరు వెంకట్రామిరెడ్డి, తెలంగాణ ఖోఖో అసోషియేషన్‌ బాధ్యులు రామకృష్ణ, వర్సిటీ క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బి.సురేశ్‌లాల్‌, స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ ప్రొఫెసర్‌ తంగెట సవితాజ్యోత్స్నతో కలిసి జెండా ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ సవితాజ్యోత్స్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ రమేశ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఆటల్లో గెలుపోటములు సహజమని చెప్పారు.  ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు నుంచి 67 జట్లు కోచ్‌, మేనేజర్లు పాల్గొంటున్నారని అన్నారు. క్రీడలతో టీం వర్క్‌, స్నేహం, నెట్‌వర్కింగ్‌ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. 

విశిష్ట అతిథిగా హాజరైన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. సమన్వయంతోనే విజయం సాధ్యమన్నారు. ఖోఖో సంప్రదాయ గ్రామీణ భారతీయ క్రీడ అయినప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. వరంగల్‌ నగరానికి గొప్ప సాంస్కృతిక, సంప్రదాయ, రాజకీయ చరిత్ర ఉందన్నారు.   రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ బాధ్యుఛిజీ రామకృష్ణ ఖోఖో క్రీడ ఔన్నత్యాన్ని చెప్పారు. సభకు సంయోజకులుగా డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వ్యవహరించగా కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, డీవో ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం, ఎస్డీఎల్‌సీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసరావు, క్రీడాధికారులు పి.కుమార్‌, 

Updated Date - 2022-03-18T05:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising