ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతోంది: కేటీఆర్

ABN, First Publish Date - 2022-02-08T20:50:49+05:30

రాష్ట్రంలో నిజ‌మైన గ్రామీణాభివృద్ధి జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో నిజ‌మైన గ్రామీణాభివృద్ధి జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామీణ యోజ‌న‌లో తొలి 10 గ్రామాల్లో 7 తెలంగాణ‌కు చెందిన‌వే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌తో రూపుదిద్దుకున్న ప‌ల్లె ప్ర‌గ‌తి వల్లే ఇది సాధ్య‌మైంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది సీఎం కెసిఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన గొప్ప విజయం! రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి టీమ్ కి శుభాకాంక్షలు! అభినందనలు!!" అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.


కేటీఆర్ ట్వీట్ కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల ప్రగతికి పట్టం కట్టింది. ఆ ఫలాలు ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయి. తెలంగాణ గ్రామాలు సమగ్రంగా స్వయం సమృద్ధిగా మారుతున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ కార్య దీక్షా దక్షులు సీఎంకి, అనునిత్యం ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు! ధన్యవాదాలు అంటూ ఎర్రబెల్లి రీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-02-08T20:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising