ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి

ABN, First Publish Date - 2022-03-12T22:04:45+05:30

శాసనసభ ద్వారా ప్రజలను మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాసనసభ ద్వారా ప్రజలను మంత్రి కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఊరు-మన బడి బాగా లేదని తాను చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఆ పథకానికి నిధులు లేవనే తాను చెప్పానన్నారు. సభలో చర్చ నడుస్తుందంటే కారణం తామేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహకరిస్తేనే సభ నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్య వైద్యానికి ప్రభుత్వం బడ్జెట్ తక్కువ కేటాయించిందన్నారు. పాఠశాలలో చాలా ఖాళీలు ఉన్నాయన్నారు. పాఠశాలలో పనిచేసే వారి స్వీపర్ల జీతాలు ఇంకా 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి పథకానికి స్టేట్ బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఏసీడీపీ నిధులను కేటాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు పాఠశాలలో ఖాళీలు ఉండకుండా చూడాలని ఆయన కోరారు.   

Updated Date - 2022-03-12T22:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising