ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊకదంపుడు మాటలు.. విచిత్ర వస్త్రధారణ!

ABN, First Publish Date - 2022-12-07T03:04:07+05:30

నోటి మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు.. చిత్రవిచిత్రమైన దుస్తులు వేసుకొని పోజు కొడితే అభివృద్ధి జరగదు. సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు’ అని మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ రకంగా పోజు కొడితే అభివృద్ధి సాధ్యమవుతుందా?

పరోక్షంగా ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ విమర్శ

తెలంగాణలో గత ఎనిమిదేళ్ల అభివృద్ధి ఛూమంతర్‌ కాదు

కేసీఆర్‌కున్న ప్రణాళిక, ప్రజల అవసరాలపైనే ఆలోచనతోనే

అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లుగా చేసుకొని సీఎం పరిపాలన

మళ్లీ మేమే.. ఎన్నికలయ్యాక హయాత్‌నగర్‌ దాకా మెట్రో: కేటీఆర్‌

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ’నోటి మాటలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు.. చిత్రవిచిత్రమైన దుస్తులు వేసుకొని పోజు కొడితే అభివృద్ధి జరగదు. సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు’ అని మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్లలో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు పెరిగిందని, స్థూల ఆదాయం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందని ఫలితంగా దేశంలోనే నంబర్‌వన్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ఇదంతా ఛూం మంతర్‌ అని అంటే జరగలేదని.. రాష్ట్ర అభివృద్ధిపై పక్కావ్యూహం, ఆ దిశగా ప్రణాళిక, ప్రజల అవసరాలు ఏమిటి? అన్న అంశాలపై కేసీఆర్‌కు ఉన్న ఆలోచనలతోనే సాధ్యమైందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా ఎన్నిమిదిన్నరేళ్లుగా సీఎం కేసీఆర్‌ సారధ్యంలో పాలన సాగుతోందన్నారు. మంగళవారం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఫతుల్లగూడ నుంచి పిర్జాదిగూడ వరకు రూ.26.5 కోట్లతో నిర్మించిన లింక్‌ రోడ్డు, రూ.16.25 కోట్లతో ఫతుల్లగూడలో ముక్తిఘాట్‌ పేరిట నిర్మించిన హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశానవాటిక, బండ్లగూడ చెరువు నుంచి నాగోల్‌ చెరువు వరకు రూ.7.26 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా నిర్మించిన నాలా, రూ.84 లక్షలతో నిర్మించిన పెంపుడు జంతువుల దహన వాటిక, వనస్థలిపురంలో ఈత కొలనును మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్తిఘాట్‌లో ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. పట్నం, పల్లెలు.. పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధితో దేశం ముందు ఇంటిగ్రేటెడ్‌ హోలిస్టిక్‌ మోడల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని చెప్పారు. కేంద్రం సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పేరిట సర్వే చేస్తే.. అగ్రభాగాన నిలిచిన 20 గ్రామాల్లో 19 తెలంగాణ పల్లెలున్నాయని, స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో అత్యుత్తమ మునిసిపాలిటీలుగా గుర్తించి రాష్ట్రానికి 26 అవార్డులు కేంద్రం ఇచ్చిందన్నారు.

ఓట్లుండని చెట్ల కోసమూ తపన!

మొక్కల పెంపకానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని కేటీఆర్‌ చెప్పారు. ’సాధారణంగా చెట్లు, పర్యావరణం గురించి నేతలు మాట్లాడరు. ఎందుకంటే చెట్లకు ఓట్లుండవు. మనుషులను బుట్టలో వేసుకునే ప్రయత్నమే చేస్తరు. మన ప్రభుత్వం వచ్చినంక 240 కోట్ల మొక్కలు నాటాం.’ అని చెప్పారు. రాష్ట్రంలో గతంలో 24 శాతంగా ఉన్న గ్రీన్‌ కవర్‌.. 7.7 శాతం పెరిగి ఇప్పుడు 31.7 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ‘బతికున్నన్ని రోజులు కులం, మతం, ప్రాంతం, భాష పేరిట కొట్లాడుకుంటం. చచ్చినంక ఒక్క దగ్గరుండాలని, అంతిమ సంస్కారాలు సంస్కారవంతంగా చేసుకునేలా.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కోసం ఒకే ప్రాంగణంలో శ్మశాన వాటికి నిర్మించాం’ అని అన్నారు. ఎమ్మెల్యే అంటే మంచి పనులు చేయాలని, అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలన్నారు.

అయస్కాంతంలా హైదరాబాద్‌కు

వ్యూహాత్మక మురుగునీటి పారుదల అభివృద్ధి వ్యవస్థ (ఎస్‌ఎన్‌డీపీ) కింద రూ.985 కోట్లతో చేపట్టిన 34 పనుల్లో.. రెండు పూర్తయ్యాయని, నెలాఖరు వరకు మరో 17, జనవరిలో మిగతా 15 పూర్తి చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. రానున్న వర్షాకాలంలోపు శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతటితో వరద సమస్యకు పరిష్కారం కాదని, రెండో దశలో మరిన్ని పనులు చేపడతామన్నారు. ‘అయస్కాంతం మాదిరిగా హైదరాబాద్‌ వైపు జనం ఆకర్షితులవుతున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి స్థిరపడుతున్నారు. నగరం విస్తరిస్తున్నట్లుగానే సౌకర్యాలు, మౌలిక వసతులు పెంచాలి. లేదంటే మరో బెంగళూరు అవుతుంది. అందుకే ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ.. రహదారుల మెరుగైన నిర్వహణ, తాగునీటి మెరుగుదల, కొత్త లింక్‌ రోడ్లు వంటివి నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. నోరు లేని మూగ జీవాలను కూడా పట్టిచ్చుకున్నప్పుడే అది మానవీయ ప్రభుత్వం అవుతుందని కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా రూ.84 లక్షలతో పెంపుడు జంతువుల అంతిమ సంస్కారాల నిర్వహణకు విద్యుత్తు దహన వాటిక ఏర్పాటుచేశామని చెప్పారు.

ఎన్నికల తర్వాత హయత్‌నగర్‌ దాకా మెట్రో

మెట్రో నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ దాకా ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో చేపడతామని కేటీఆర్‌ తెలిపారు. ’ఎట్లాగు మీకు తెలుసు.. నాకూ తెలుసు.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌.. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల అనంతరం ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరిస్తాం’ అన్నారు. 1500 పడకలతో టిమ్స్‌ ఆస్పత్రి గడ్డి అన్నారంలో రాబోతోందన్నారు.

Updated Date - 2022-12-07T03:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising