ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా, గోదావరికి వరద తగ్గుముఖం

ABN, First Publish Date - 2022-08-20T09:40:07+05:30

కృష్ణా, గోదావరి బేసిన్‌లకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కృష్ణా, గోదావరి బేసిన్‌లకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 2.86 లక్షల క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయానికి 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1.73 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 54వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 66 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, తుపాకుల గూడెం తదితర బ్యారేజీలకు సగటున 8 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. రాష్ట్రమంతటా ప్రాజెక్టుల కింద ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. రోజుకు సగటున 46.69 మిలియన్‌ యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో భద్రాచలం సబ్‌కలెక్టరు వెంకటేశ్వర్లు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

Updated Date - 2022-08-20T09:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising