ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమ్మాల జాతర వేలంతో భారీ ఆదాయం

ABN, First Publish Date - 2022-03-05T06:02:25+05:30

కొమ్మాల జాతర వేలంతో భారీ ఆదాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీసుగొండ, మార్చి 4: కొమ్మాలలోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి జాతరలో కొబ్బరి కాయలు, పుట్నాల విక్రయాలు, కొబ్బరిచిప్పల సేకరణ కోసం  శుక్రవారం వేలం నిర్వహించారు. కొబ్బరికాయల వేలానికి రూ.6లక్షలు, కొబ్బరిచిప్పల సేకరణకు రూ.93,500, రూ.పుట్నాలకు 13,500 మొత్తంగా రూ.7,07,000 ఆదాయం వచ్చినట్లు ఈవో గుళ్లపెల్లి శేషగిరి తెలిపారు. ఈనెల 10నుంచి 24 వరకు వేలం  హక్కుదారులు ఆయా వస్తువులను అమ్ముకోవచ్చని తెలిపారు. గతేడాది కంటే ఈసారి రూ.1.64 లక్షల మేర ఎక్కువ ఆదాయం వచ్చినట్లు వివరించారు. తలనీలాలకు ఈనెల 8న మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల మండలి చైర్మన్‌ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్‌ వీరాటి రవీందర్‌రెడి పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-05T06:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising