ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajagopal resignation: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా... ఆమోదం

ABN, First Publish Date - 2022-08-08T16:45:47+05:30

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యే(MLA) పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy rajagopal reddy) రాజీనామా చేశారు. సోమవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharama srinivasreddy)ని కలిసిన రాజగోపాల్‌ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం (Office of the Speaker) అధికారికంగా ప్రకటించింది. రాజీనామా చేసిన కొన్నినిమిషాలకే ఆమోదం లభించింది. అనంతరం గవర్నర్ తమిళిసై (Tamilisai)ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. 2018 డిసెంబర్‌లో మునుగోడు ఎమ్మెల్యే (Munugodu MLA)గా కోమటిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. 


మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా అన్న రాజగోపాల్ రెడ్డి...

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి... అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందన్నారు. కేసీఆర్ (KCR) చేతిలో చిక్కిన తెలంగాణ (Telangana) తల్లిని కాపాడుకోవాలని అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తన రాజీనామా అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని... రాజీనామా అనగానే గట్టుప్పల్ మండలం అయ్యిందన్నారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ (TRS) తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమర్శించారు. ఉప ఎన్నిక (By-election) వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని తెలిపారు. టీపీసీసీ చీప్ (TPCC Chief) భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-08-08T16:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising