ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy Brothers: సోనియా, రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-05T23:00:41+05:30

కేంద్రమంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah)ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్‌ కలిశారు. అనంతరం వెంకటరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah)ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్‌ కలిశారు. అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వరద నష్టాలపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. వరద బాధితుల కష్టాలను అమిత్‌షాకు తెలియజేశానని, తెలంగాణ (Telangana)లో భారీ వర్షాల వల్ల రూ.1400 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఈ భేటీకి తాను వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేదని పేర్కొన్నారు. పార్టీ మారేదే లేదని, ఒకవేళ మారితే బరాబర్‌ చెప్పే వెళ్తానని, తాను ఎవరికీ భయపడనని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.  


‘‘నా నియోజకవర్గ పరిధిలో నన్ను అడగకుండా.. రేవంత్‌ ఎలా మీటింగ్‌ పెడతారు?.. నన్ను ఓడించేందుకు యత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోంది. పార్టీ నుంచి పాత కాంగ్రెస్‌ నేతలనంతా వెళ్లగొట్టాలని చూస్తున్నారు. నన్ను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మా పార్టీలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. సోనియా, రాహుల్‌ (Sonia Rahul) దగ్గరే తేల్చుకుంటా’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-08-05T23:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising