ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy Brothers: 21న బీజేపీలో చేరుతా: రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-05T23:19:07+05:30

కేంద్రమంత్రి అమిత్‌షాను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌షాను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కలిశారు. పార్టీలో చేరడంపై అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి చర్చించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా (Amit Shah) తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. 21న తెలంగాణకు అమిత్‌షా రాబోతున్నారని, అమిత్‌షా సమక్షంలో అదే రోజు బీజేపీలో చేరుతానని ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్నాయని, ఆయన కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్‌షిప్‌పై తమకు నమ్మకం లేదని చెప్పారు. టీసీపీపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని సీఎం చేయడానికి తాము కష్టపడాలా? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇస్తారని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ నుంచి చాలామంది బయటకు వస్తారని రాజగోపాల్ వెల్లడించారు.


కొద్దిరోజులుగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సంకేతాలిస్తున్న మునుగోడు శాసనసభ్యుడు కోమటి రాజగోపాల్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై పోరాడలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన... స్పీకర్ అపాయింట్‌మెంట్ తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడించారు. 

Updated Date - 2022-08-05T23:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising