ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కుటుంబ సభ్యుడు

ABN, First Publish Date - 2022-08-06T09:08:41+05:30

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ పార్టీ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయనతో నాకు మనస్పర్థలు లేవు.. ఢిల్లీలో రేవంత్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ పార్టీ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఢిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతోపాటు తన పార్టీని విలీనం చేసిన సందర్భంగా రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావించే కోమటిరెడ్డి బ్రాండ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందన్నారు. లేదంటే ఆయన బ్రాండీ షాపులో పనిచేయడానికి కూడా పనిరారని అన్నారు. తాను గతంలో చేసిన ఇదే వ్యాఖ్యకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధంలేదని, ఆయన తన కంటే సీనియర్‌ నాయకుడని చెప్పారు. వెంకట్‌రెడ్డితో తనకు  ఎటువంటి మనస్పర్థలు లేవన్నారు. రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందని, ఆయన టెండర్లు, కాంట్రాక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన కాంట్రాక్టులను కమీషన్లు తీసుకొని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అమ్ముకున్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. 

Updated Date - 2022-08-06T09:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising