ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana bhavanలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేకే

ABN, First Publish Date - 2022-08-15T16:56:04+05:30

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌‌లో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం (Independence day) సందర్భంగా తెలంగాణ భవన్‌ (Telangana bhavan)లో టీఆర్ఎస్ (TRS) పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు (K keshava rao) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాదిమంది స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించారని, త్యాగాలు చేశారన్నారు. బ్రిటీష్ వారిపై మూడువందల సంవత్సరాల పోరాటం తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. నెహ్రూ (Nehru), సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar vallabhai patel), సుభాష్ చంద్రబోస్ (Subhash chandrabos) లాంటి మహనీయుల పోరాటాలతో స్వాతంత్ర్య వచ్చిందని అన్నారు. తిలక్ (Tilak) స్వరాజ్యం మన జన్మ హక్కని నినదించారన్నారు. హైదరాబాద్ నిజాం రాజ్యంలో సరోజినీ నాయుడు (sarojini naidu) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశంలో పేదరిక నిర్మూలన మతసామరస్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు, ఆకాంక్షలు కాపాడుకోవాలని అన్నారు. మనం తెలంగాణలో కూడా స్వాతంత్ర వజ్రోత్సవాలను 15 రోజులపాటు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కేకే పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-15T16:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising