ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్న కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-26T16:27:22+05:30

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భారత ప్రభుత్వం వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని తెలిపారు. రామప్పకు మొదటిసారి విఫలమైనా రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. వేయిస్థంబాల దేవాలయం కళ్యాణ మండపం గురించి ప్రధాని నరేంద్రమోదీకి చెప్పామన్నారు. రామప్పకు మూడు కోట్ల 70లక్షలు ఖర్చు చేస్తున్నామని, టూరిజం ప్రసాద్ స్కీమ్ క్రింద రూ.50 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. భద్రాచలం టెంపుల్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాత పనులు చేపడుతామని తెలిపారు. ములుగులో ట్రైబల్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-26T16:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising