ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేశారు?: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-01-04T21:00:40+05:30

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.  జాగరణ దీక్ష సందర్భంగా కార్యాలయంలో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్‌, సామగ్రిని పరిశీలించారు.  ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఆఫీస్‌ అద్దాలు ధ్వంసం, సీసీ పుటేజీ ఎత్తుకుపోవడమేంటి? అని నిలదీశారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీ ఆఫీస్‌లోకి రావడానికి పోలీసులకు ఏం అధికారం ఉందన్నారు.ప్రజా సమస్యలపై సంజయ్‌ దీక్ష చేస్తే పోలీసులు అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ ఆఫీస్‌ను యుద్ధభూమిగా మార్చారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి సంజయ్‌ని జైలుకు పంపారని మండిపడ్డారు. కొవిడ్‌ నిబంధనల సాకుతో తప్పుడు పెట్టి వేధిస్తున్నారన్నారు. కొవిడ్‌ నిబంధనలు బీజేపీ ఆఫీస్‌కు మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.  ‘‘మీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు’’ అని  కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-01-04T21:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising