ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్ - కేసీఆర్ మధ్య గ్యాప్‌నకు ఈటలే కారణం : కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-26T18:13:16+05:30

గవర్నర్ - కేసీఆర్ మధ్య గ్యాప్‌నకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందరే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : గవర్నర్ - సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్‌నకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందరే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్‌పై కేసీఆర్‌కు కోపం వచ్చిందన్నారు. అందుకే గవర్నర్‌ను తరచూ అవమానిస్తున్నారన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వస్తే కలెక్టర్, ఎస్పీ లేకపోవడం అవమానకరమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు దశల వారీగా వస్తాయన్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది. బీజేపీని తిట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్రోత్సహిస్తోంది. కేసీఆర్ మెప్పు కోసం టీఆర్ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కరోనాను జయించే దిశగా భారత్ ఉంది. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా 112 వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని దృష్టి పెట్టారు. ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహింబోతోంది. జులై 4న అల్లూరి 125వ జయంతిని ఏపీలో ఘనంగా నిర్వహిస్తాం. దీనికి ప్రధాని కూడా హాజరవుతారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఆరోజు దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటా జాతీయ పతాకం ఎగరాలి.. జాతీయగీతం ఆలపించాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-26T18:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising