ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్‌ సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్‌లు!

ABN, First Publish Date - 2022-02-16T08:31:33+05:30

ఎవరో అమ్మాయి.. ఏదో నంబరు నుంచి ఫోన్‌ చేసి తియ్యగా మాట్లాడితే జర భద్రం! కమ్మగా కబుర్లాడి చెప్పిన చోటుకు రమ్మంటే వెళ్లేరు? లేదంటే జేబుకు లక్షల్లో చిల్లు తప్పదు! ఓటీటీలో ‘మనీ హీస్ట్‌’ వెబ్‌ సిరీ్‌సతో స్ఫూరిపోందాడో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమ్మాయితో యువకులకు ఫోన్లు.. వలపు వల..
  • చెప్పిన చోటుకు వారిని రప్పించి అపహరణ 
  • ‘మనీ హీస్ట్‌’ను చూసి ఓ పాతనేరగాడి స్కెచ్‌ 
  • 6 కిడ్నా్‌పలు.. రూ.50లక్షల దాకా వసూలు
  • నలుగురి అరెస్టు..  యువతి కోసం గాలింపు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎవరో అమ్మాయి.. ఏదో నంబరు నుంచి ఫోన్‌ చేసి తియ్యగా మాట్లాడితే జర భద్రం! కమ్మగా కబుర్లాడి చెప్పిన చోటుకు రమ్మంటే వెళ్లేరు? లేదంటే జేబుకు లక్షల్లో చిల్లు తప్పదు! ఓటీటీలో ‘మనీ హీస్ట్‌’ వెబ్‌ సిరీ్‌సతో స్ఫూరిపోందాడో యువకుడు. అందులో ఓ ప్రొఫెసర్‌, కొందరు వ్యక్తులను నియమించి వారి ద్వారా నేరాలను చేయించడం భలే అనిపించి డబ్బున్న యువకులను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశాడు. ఫోన్‌ చేసేందుకు ఓ యువతిని.. ఆ తర్వాత పథకాన్ని అమలు చేసేందుకు ముగ్గురు యువకులను నియమించుకున్నాడు. ఇప్పటిదాకా ఆరు కిడ్నా్‌పలు చేసి దాదాపు రూ.50 లక్షల దాకా వసూలు చేశాడు! మంగళవారం పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంజగోపు సురేశ్‌ (27) అలియాస్‌ సూరి డ్రైవర్‌. అత్తాపూర్‌లో ఉంటున్నాడు. గతంలోనే నేరచరిత్ర ఉంది. జైలుకెళ్లొచ్చాడు. ‘మనీ హీస్ట్‌’ వెబ్‌ సిరీ్‌సను చూసి కిడ్నా్‌పలతో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందుకు మెహదీపట్నం, భోజగుట్టకు చెందిన యువకులు రోహిత్‌, నర్సింహులు, కునాల్‌తో పాటు శ్వేతా చారి అనే అమ్మాయిని నియమించుకున్నాడు. ఎంచుకున్న యువకుడికి శ్వేత ఫోన్‌ చేసి.. కొన్నాళ్లకు చనువు పెంచుకొని చెప్పిన చోటుకు రప్పిస్తుంది. అప్పటికే అక్కడ ముసుగు తొడుక్కొని మాటు వేసిన నలుగురూ సదరు యువకుడిని కారులో కిడ్నాప్‌ చేస్తారు. 


ఓ తల్లి ఫిర్యాదుతో... 

గుడిమల్కాపుర్‌ మార్కెట్‌లో పూల వ్యాపారం చేసే ప్రశాంత్‌ అనే యువకుడు ఈ నెల 5న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. అతడి కోసం గాలించిన కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. మరుసటి రోజు యువకుడి తల్లి ఆసి్‌ఫనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ప్రశాంత్‌ సోదరుడు ఆంజనేయులుకు ఫోన్‌ చేసి ప్రశాంత్‌ను కిడ్నాప్‌ చేశామని... డబ్బులు ఇస్తేనే వదిలేస్తామని ఆంజనేయులును కిడ్నాపర్లు బెదిరించారు. కిడ్నాపర్లు చెప్పినట్టే బాధిత కుటుంబీకులు ఔటర్‌ రింగ్‌రోడ్‌ వద్ద డబ్బులు అందజేశారు. తర్వాత ప్రశాంత్‌ను వదిలేశారు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సాంకేతిక ఆధారంగా ప్రధాన నిందితుడు సురేశ్‌ సహా నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలు శ్వేత కోసం గాలిస్తున్నారు. సురేశ్‌ 2011 నుంచే చోరీల బాట పట్టాడు. 2019 వరకు 14 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కిడ్నా్‌పల వ్యవహారంలో నిందితులు ఇప్పటి వరకు రూ.50లక్షల వరకు కాజేసి ఉంటారని పోలీసుల అంచనా. కిడ్నాప్‌ చేసిన తర్వాత హత్యల్లాంటి నేరాలకు పాల్పడకపోయినా మూడు కేసుల్లో బాధితులను తీవ్రంగా కొట్టినట్లు డీసీపీ వెల్లడించారు.


బాధితుడి ఫోన్‌తోనే..

కిడ్నాప్‌ చేసిన తర్వాత బాధితుడి ఫోన్‌ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేస్తారు. నేరుగా కాల్‌ చేస్తే పోలీసులు లొకేషన్‌ పసిగడతారని వాట్సాప్‌ కాల్‌ మాత్రమే చేస్తారు. డబ్బు తీసుకున్న తర్వాత.. తానో పెద్ద గూండానని, విషయం బయటపెడితే చంపేస్తానని బాధితుడిని సురేశ్‌ బెదిరిస్తాడు. వీరు ఇప్పటిదాకా ఆరు కిడ్నా్‌పలు చేశారు.  అమ్మాయి వలలో పడి కిడ్నా్‌పనకు గురయ్యామని తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ గ్యాంగ్‌ మరింత రెచ్చిపోయింది. లక్షల్లో డబ్బు వసూలు చేసి.. అంతా పంచుకున్నారు. 

Updated Date - 2022-02-16T08:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising