అభివృద్ధి పనులను వేగిరం చేయాలి
ABN, First Publish Date - 2022-12-31T22:48:57+05:30
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధికారులకు సూచించారు.
మధిర, డిసెంబరు 31: అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణంలో నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రి, ఇండోర్ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి కాంట్రక్టర్లకు, అధికారులకు పనుల సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత, తాళ్లూరి హరీష్, పార్టీ నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా వేణు, అరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, జయాకర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T22:48:59+05:30 IST