ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు సర్వే చేపట్టాలని ఆందోళన

ABN, First Publish Date - 2022-11-16T23:57:00+05:30

పోడు భూముల సర్వేను చేపట్టి అర్హులైన పోడురైతులందరికి పట్టాలను మంజూరీ చేయాలని కోరుతూ బుధవారం జూలూరుపాడులోని అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, ఎన్‌డీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలూరుపాడు, నవంబరు 16: పోడు భూముల సర్వేను చేపట్టి అర్హులైన పోడురైతులందరికి పట్టాలను మంజూరీ చేయాలని కోరుతూ బుధవారం జూలూరుపాడులోని అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, ఎన్‌డీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ మండలంలోని కొత్తూరు, పాపకొల్లు గ్రామాలకు చెందిన 70మంది రైతులు 40 సంవత్సరాల నుంచి రాజారావుపేట అటవీ ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అటవీ అధికారులు ఆ భూముల్లో రెండు సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకొని ఆందోళనలు చేశారన్నారు. సదరు రైతులు తమ భూములను సర్వే చేసి హక్కుపత్రాలు మంజూరీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికి క్లైమ్‌ నెంబర్లు ఉన్నాయని చెప్పి అటవీ అధికారులు వారి భూములను సర్వే చేయకుండ నిర్లక్ష్యం చేడం తగదన్నారు. తక్షణమే రైతుల భూములను సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎఫ్‌ఆర్‌వో ప్రసాదరావుకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎన్‌డీ నాయకులు షేక్‌ నాగుల్‌ మీరా, యాసా నరేష్‌, ఏదులాపురం గోపాలరావు, రైతులు లక్ష్మి, నర్సింహారావు, కృష్ణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising