ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకగిరి అడువుల్లో పెరిగిన వన్యప్రాణులు

ABN, First Publish Date - 2022-12-07T00:03:28+05:30

జిల్లాలోనే పేరున్న కనకగిరి అడవులు వన్యప్రాణాలకు ఆవాసంగా మారింది. అడవి దట్టంగా ఉండటంతో వీటిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతపులి సంచారం నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి తల్లాడ అటవీశాఖ అధికారులు అడవుల్లో పర్యటించిన సందర్భంగా రకరకాల వన్యప్రాణులు వారి కంట పడ్డాయి.

సీసీ కెమెరాకు చిక్కిన వన్యప్రాణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏన్కూరు, డిసెంబరు6: జిల్లాలోనే పేరున్న కనకగిరి అడవులు వన్యప్రాణాలకు ఆవాసంగా మారింది. అడవి దట్టంగా ఉండటంతో వీటిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతపులి సంచారం నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి తల్లాడ అటవీశాఖ అధికారులు అడవుల్లో పర్యటించిన సందర్భంగా రకరకాల వన్యప్రాణులు వారి కంట పడ్డాయి. ఇప్పటి వరకు అధికారులకు నాచారం, మేడేపల్లి అడవుల్లో పాదముద్రలు లభించాయి. చిరుత ఎక్కడెక్కడ తిరుగుతుందని విషయంపై అటవీశాఖ అధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరుత పాదముద్రలతో పాటు వీరికి ఎలుగుబంటి పాదముద్రల కూడా లభించాయి. ఎగులుబంట్లు సంఖ్య కూడా ఈప్రాంతలో పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. అడవిదున్నల్లు, మనుబోతులు, కనజులు, జింకలు, కొండగొర్రెలు, జింకలసంతతికూడా పెరగడతో చిరుత కనకగిరి రిజర్వు ఫారెస్టులో నే తిష్టవేసినట్టు భావిస్తున్నారు. గతరెండు, మూడేళ్లనుంచి దట్టమైన అడవి పెరగడంతో వన్య ప్రాణులకు ఇక్కడ అనుకూల వాతావరణం ఏర్పడింది. కనకగిరి రిజర్వుఫారెస్టు తల్లాడ, కల్లూరు, చండ్రుగొండ, ఏన్కూరు మండలాల పరిధిలో సుమారు 60వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.

Updated Date - 2022-12-07T00:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising