ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

ABN, First Publish Date - 2022-03-05T07:49:47+05:30

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరి సమస్యలను పరిష్కరిస్తాం 

పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 

హాజరైన టీపీసీసీ నాయకులు 

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి) /ముదిగొండ, మార్చి 4 : రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని, టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పక పరిష్కారం ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆయన పీపుల్స్‌మార్చ్‌ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆరోరోజైన శుక్రవారం ముదిగొండ మండలంలో బాణాపురం, వల్లభి, మల్లారం మీదుగా పాదయాత్ర సాగింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో భట్టికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనుకొనే శక్తులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలుస్తున్నారని, అందులో భాగంగానే సుబ్రహ్మణ్యస్వామిని కలిశారన్నారు. బీజేపీపై వ్యతిరేకమంటూ కాంగ్రెస్‌కు నష్టం పరిచేలా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు కేసీఆర్‌ ఆరాటపడుతున్నారని, ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, నిధులు, నీళ్లు,నియామకాల కోసం సోనియాగాంధీ తెలంగాణా ఇస్తే కేసీఆర్‌ ఆ లక్ష్యానికితూట్టు పొడిచారని మండిపడ్డారు. రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేలు ఇస్తూ, గిట్లుబాటు ధర చెల్లించకుండా రూ,30వేలు నష్టం చేకూరుస్తున్నారని భట్ట పేర్కొన్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వటంలేదని, విద్యా, వైద్యం ప్రజలకు అందటం లేదని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ అమలు చేయటం లేదని, పంటల నష్టపరిహారం ఇవ్వటం లేదని, బంగారు తెలంగాణా ఎట్లా అవుతుందని భట్టి ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమపఽథకాలు ఇప్పుడు ఎందుకు అమలుచేయలేక పోతున్నారని ప్రశ్నించారు. మిర్చి రైతులు తామరపురుగుతో పెద్ద ఎత్తున నష్టపోయారనిచ ఎకరానికి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా, మిర్చిరైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ప్రకటించారు. అయితే పాదయాత్రలో పలువురు సమస్యలపై భట్టికి వినతిపత్రాలు అందజేశారు. వారితో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, ప్రజల కలలన్నీ నిజం కాబోతున్నాయని, ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కల్లుగీత కార్మికులు తాటివనాల వద్ద భట్టికి స్వాగతం పలికి వారి సమస్యలను చెప్పుకొన్నారు. తాటిచెట్లు ఎక్కటానికి ఎలకా్ట్రనిక్‌ పరికరాలు ఇస్తామని, ఇవ్వటం లేదని, తమకు ప్రత్యేకంగా సంక్షేమ ప్రథకాలు ప్రభుత్వం అందించటం లేదని తెలిపారు. చేపలు అమ్ముకునేందుకు ద్విచక్రవాహనాలు ఇవ్వటం లేదని మత్స్యకారులు తెలిపారు. అందుకు స్పందించిన భట్టి వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, తాటివనాలు సొసైటీలకు ఇస్తామని, కల్లు విక్రయాలకు తగిన ప్రోత్సాహం ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గీత కార్మికుల కోరిక మేరకు భట్టి కల్లు రుచి చూశారు. ఇక భట్టి పాదయాత్రకు కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు వేంనరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బెల్లయ్యనాయక్‌, అన్వేష్‌రెడ్డి, భరతచంద్రారెడ్డి హాజరై భట్టితో పాటు నడిచారు. స్థానిక సీపీఎం, టీడీపీ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-03-05T07:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising