ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

ABN, First Publish Date - 2022-08-04T07:26:33+05:30

మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌

ఖమ్మం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాల విభజన అనంతరం మొదటి పాలకవర్గంగా ఎన్నికైన తాము ఈ మూడేళ్లు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశామని ఖమ్మం జిల్లాపరిషత చైర్మన లింగాల కమల్‌రాజ్‌ పేర్కొన్నారు. బుధవారం డీపీఆర్సీ భవన్‌లో పలువురు జడ్పీటీసీ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అందరి సభ్యుల సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నామని, మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాలకవర్గానికి ఎంతో సహకరిస్తున్నారన్నారు. కొవిడ్‌ కష్టకాలంలోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలు నిర్వహించారని, కరోనా బాధితులకు వైద్యసేవలందించడంలో సహకరించారన్నారు. సీఎం కేసీఆర్‌ సాధారణ నిధులు కాకుండా జిల్లాకు రూ.10కోట్లు కేటాయించారని అందులో రూ.6.50కోట్లతో అన్ని మండలాల్లో పనులు చేపట్టామన్నారు. గతంకంటే ఎక్కుడగా ఈ సారి కారుణ్య నియామకాలు కూడా చేశామన్నారు. 2019-20లో సాధారణనిధులు రూ.1.91కోట్లతో 52 పనులు పూర్తిచేశామని, 2020-21లోకూడా రూ.27.80లక్షలతో తొమ్మిదిపనులను పూర్తిచేశామన్నారు. గత మూడేళ్లుగా జిల్లాపరిషత సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థికసంఘం నిధు ల ద్వారా పాఠశాలలు, రోడ్లు, డ్రెయినేజీలు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పనులుచేపట్టామన్నారు. రాష్ట్ర పర్యవేక్షక నిధుల ననుంంచి రూ.6.69కోట్లతో 177పనులు పనులు చేప్టటడం జరిగిందన్నారు. అలాగే ఎస్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా మధిర నియోజకవర్గంలో రూ.2.50కోట్లతో 58పనులు పూర్తిచేయించామన్నారు. జడ్పీ పరిపాలన కింద పలువురు ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించామన్నారు. మంత్రి పువ్వాడ సహకారంతో మధిర మునిసిపాలిటీ, నియోజకవర్గంలో కమ్యూనిటీహెల్త్‌ సెంటర్‌, వంద పడకల ఆసుపత్రి, రూ.35 కోట్ల అంచనాలతో మంజూరు చేశారని, అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్మిస్తున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, కరోనా నిర్ధారణ పరీక్షలకు వైరాలజీ ల్యాబ్‌, ఆర్టీపీసీఆర్‌ ఏర్పాటుచేశామని, లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకు నెలకొల్పామని, 350పడకలతో కొవిడ్‌ వార్డును ఏర్పాటుచేసి వైద్యం అందించగలిగామన్నారు. మాతా శిశు విభాగం ద్వారా మాతా శిశు సంరక్షణకు సదుపాయాలు మెరుగుపరిచామని, రోగ నిర్ధారణ పరీక్షలకు టీహబ్‌, కార్డియాలజీ విభాగం, సీటీస్కాన్‌ తదితర సౌకర్యాలు సమకూర్చామన్నారు. 

Updated Date - 2022-08-04T07:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising