పవిత్రోత్సవాల కోసం రాస్తారోకో
ABN, First Publish Date - 2022-08-05T03:57:48+05:30
పులిగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మూడురోజులపాటు నిర్వహిం చతలపెట్టిన పవిత్రోత్స వాలను రద్దు చేయటంతో గొల్లపూడి గ్రామస్థులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
వైరా, ఆగస్టు 4: పులిగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మూడురోజులపాటు నిర్వహిం చతలపెట్టిన పవిత్రోత్స వాలను రద్దు చేయటంతో గొల్లపూడి గ్రామస్థులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. సీఐ టి.సురేష్ ఆధ్వర్యంలో వైరా సబ్‌డివిజన్‌లోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది రెబ్బవరం, పాలడుగుకు చేరుకొని ట్రాఫిక్‌ను ఖానాపురం, గన్నవరం మీదుగా మళ్లించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి 4నుంచి 7 వరకు పవిత్రోత్సవాలు, యాగం నిర్వహించేందుకు ముందుకొచ్చారు. అందుకు దేవాదాయ ధర్మాదాయశాఖ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహిస్తానని లిఖితపూర్వకంగా స్పష్టం చేయటంతో ఆలయ మేనేజర్ ఎస్వీడీ.ప్రసాద్ అ నుమతి ఇచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన కొందరు ఎమ్మె ల్యేలు, నాయకుల పేరుతో ఆహ్వానపత్రికలు, ప్రచార వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశా రు. ఇదే వివాదానికి కారణమైంది. దీంతో ఈవో పవిత్రోత్సవాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పవిత్రోత్సవాలు రద్దుచేయటం వల్ల తమ గ్రామానికి అరిష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గొల్లపూడి గ్రామస్థులు ఆందోళన చేశారు. ముందుగా సీఐ సురేష్ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులతో మాట్లాడినా ఉపయోగం లేకుండాపోయింది. పవిత్రోత్సవాలను నిర్వహించాలని, ఆలయ మేనేజర్ రావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆ సమయంలో సీఐ సురేష్ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆ శాఖ జిల్లా సూపరింటెండెంట్ గౌరీశంకర్, ఇన్స్పెక్టర్ సమత, గొల్లపూడి ఆలయ మేనేజర్ ఎస్వీడీ.ప్రసాద్ సహా పలు ఆలయాల ఈవోలు గొల్లపూడిలోని రాస్తారోకో వద్దకు చేరుకున్నారు. ఈనెల 21 లోగా పవిత్రోత్సవాలు, యాగాలను నిర్వహిస్తామని మేనేజర్ ఎస్వీడీ.ప్రసాద్ ప్రకటించారు. దీంతో సీఐ రాస్తారోకోను విరమింపజేశారు.
Updated Date - 2022-08-05T03:57:48+05:30 IST