ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా విజయ దశమి

ABN, First Publish Date - 2022-10-07T06:20:20+05:30

వేడుకగా విజయ దశమి

ఖమ్మం జమ్మిబండ వద్ద బాణం సంధిస్తున్న మంత్రి, సీపీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరుజిల్లాల్లో అంబరాన్నంటిన దసరా సంబురం

ఘనంగా శమీ, ఆయుధ పూజలు

ఖమ్మం జమ్మిబండ వద్ద పూజల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం ఖానాపురంహవేలి / కొత్తగూడెం సాంస్కృతికం, అక్టోబరు 6: ఇరుజిల్లాల వ్యాప్తంగా విజయ దశమి అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయగా.. సాయంత్రం శమీపూజలు, రావణదహనం, పారువేట తదితర కార్యక్రమాలను సంప్రదాయ బద్ధంగా జరిగాయి. ఖమ్మం జమ్మిబండ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన వేడుకల్లో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌, తదితరులు పాల్గొన్నారు. రావణసురుడి బొమ్మ పైకి మంత్రి పువ్వాడ బాణం సంధించి రావణ దహనం నిర్వహించారు. అయితే వర్షం కారణంగా ఇక్కడ వైభవంగా జరగాల్సిన పారువేట కార్యక్రమాన్ని వేదపండితులు రద్దుచేశారు. జమ్మిపూజను నర్సింహాస్వామి ఆలయంలో నిర్వహించి ఆజమ్మి ఆకును జమ్మిబండ వద్ద ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మంజిల్లాకు స్తంభాద్రి లక్ష్మినర్సింహస్వామి ఆలయం ఒక గొప్ప ఖ్యాతి అని, జమ్మిబండ, ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి తన వంతు కృషిచేస్తానన్నారు. అలాగే సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెంలో రైటర్‌బస్తీ ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇల్లెందులో సింగరేణి పాఠశాల ఆవరణలో జరిగిన సంబురానికి జనం పోటెత్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, తదితరులు హాజరయ్యారు. అశ్వారావుపేట, పినపాక, భద్రాచలంలో దసరా వేడుకలు కన్నులపండుగ్గా జరగ్గా.. భద్రాద్రి రామాలయంలో శమీ, ఆయుధపూజలు, రామ్‌లీలా ఉత్సవం, శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 


నేత్రపర్వంగా అమ్మవారి నిమజ్జనం

దేవీశరన్నవరాత్రులు ముగిశాయి. నవరాత్రుల పాటు అమ్మవారికి పూజలు చేసిన భక్తులు గురువారం ఇరుజిల్లాల ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. డప్పువాయిద్యాలు, మేళతాళాలు, కోలాట నృత్యాల మధ్య అమ్మవారిని ఊరేగించి.. నిమజ్జనం చేశారు. ఖమ్మం నగరంలో అమ్మవారి విగ్రహాలను మున్నేటిలో నిమజ్జనం చేశారు. కరోనా భయం నేపథ్యంలో రెండేళ్ల పాటు కళతప్పిన ఉత్సవాలు ఈ ఏడాది అట్టహాసంగా జరిగాయి. 





Updated Date - 2022-10-07T06:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising