ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయ రాఘవుడి విజయోత్సవం

ABN, First Publish Date - 2022-10-07T06:23:09+05:30

విజయ రాఘవుడి విజయోత్సవం

జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రిలో ఘనంగా శమీపూజ, రామయ్యకు మహాపట్టాభిషేకం

సంప్రదాయబద్ధంగా శ్రీ రామ్‌లీలా మహోత్సవం

భద్రాచలం, అక్టోబరు 6 : దక్షిణఅయోధ్య భద్రాచలంలో బుధవారం విజయదశమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరాధన ప్రక్రియలో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి అష్టోత్తర, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ క్రమంలో నిత్యకల్యాణాన్ని, అనంతరం శ్రీరామాయణ పారాయణ సమాప్తిని పురస్కరించుకొని శ్రీ రామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, త్రయమండలార్చన, రామాయణంలోని పట్టాభిషేకఘట్ట పారాయణం, కిరీటధారణ, కలశ జలాలతో స్వామి వారికి ప్రోక్షణ, వేదాశీర్వచనం, మంగళహారతి సమర్పించారు. ఆ తర్వాత సీతారామచంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి మేళతాళాల మధ్య విజయోత్సవం, శమీ పూజ కోసం స్థానిక దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. శమీ వృక్షానికి పూజలు చేయడంతో పాటు సుదర్శనం, ఖడ్గం, ధనస్సు, గధ తదితర ఆయుధాలకు పూజలు చేశారు. చివరగా నాలుగు దిక్కుల్లో దిక్పతులైన ఇంద్రుడు,యముడు, వరుణుడు, కుబేరునకు ఆకాశం, భూమికి బాణాలు సంధించారు. ఈ సందర్భంగా జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి వాటిని భక్తులపై చల్లారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించారు. ఈ సమయంలో రావణాసుర బొమ్మపై బాణాన్ని దేవస్థానం ఈవో బి.శివాజీ సంధించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్‌ ఈఈ వి.రవీంద్రనాథ్‌, ఏఈవోలు శ్రావణ్‌కుమార్‌, భవానీ రామకృష్ణారావు, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు, నిరంజన, లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయాణాచార్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, చెన్నకృష్ణమాచార్యులు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు, పరిపాలన, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.

పండగే.. పండగ.. 

దసరా రోజున ఉమ్మడి జిల్లాలో రూ.25.42కోట్ల వ్యాపారం

ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 6: ‘దసరా వచ్చిందయ్యా..’ అంటూ మందుబాబులు సరదా చేశారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం ఒక్కరోజే రూ.25.42కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. ఇది గతేడాది కంటే 12శాతం ఎక్కువ కాగా.. బీర్ల అమ్మకాలు జోరుగా జరిగాయి. అక్టోబరు మొదటి వారంలో సెలవులు రావటంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు ముందస్తు కార్యాచరణతో ఉమ్మడి జిల్లాకు మద్యం తరలింపు ప్రక్రియను గతన 30నే పూర్తి చేశారు. ఇక పండుగ రోజైన బుధవారం ఒక్క రోజే రూ.25.42కోట్లు విలువైన 38వేల మద్యం కేసులను వ్యాపారులు విక్రయించారు. గత సంవత్సరం బీరు 82,443 కేసులు అమ్మగా.. ఈ దసరాకు 1,00,573కేసులు అమ్ముడయ్యాయి. 

Updated Date - 2022-10-07T06:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising