ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌ అప్‌డేట్‌ పేరిట నిలువు దోపిడీ

ABN, First Publish Date - 2022-12-10T00:07:06+05:30

ఆధార్‌ అప్‌డేట్‌ పేరిట మండలంలో దోపిడీ జరుగుతోంది. మండల పరిధిలోని లక్ష్మీనగరంలోని ఓ మీసేవ కేంద్రం ఒక్కొరికి వద్ద రూ.170 వసూలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.50కు బదులుగా రూ.170 వసూలు

దుమ్ముగూడెం డిసెంబరు 9: ఆధార్‌ అప్‌డేట్‌ పేరిట మండలంలో దోపిడీ జరుగుతోంది. మండల పరిధిలోని లక్ష్మీనగరంలోని ఓ మీసేవ కేంద్రం ఒక్కొరికి వద్ద రూ.170 వసూలు చేస్తున్నారు. మండల రెవెన్యూ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఆదివాసీలతోసహా అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో మీసేవా కేంద్రం సైతం రూ.110 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక పేజీగల దరఖాస్తుఫారం రూ.30కు విక్రయిస్తుండగా, వివరాలు నింపడానికి మరో 30 అదనంగా వసూలు చేస్తున్నారు. అప్‌డేట్‌ చేసేందుకు మరో రూ.110 చార్జి చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరి నుంచి అప్‌డేట్‌ పేరిట రూ.170 వరకు అక్రమంగా గుంజుతున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర ప్రకారం ఆధార్‌ అప్‌డేట్‌ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి కేవలం రూ.50 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కాగా ఒక కేంద్రంలో మాత్రం ప్రక్రియ అంతా కేవలం రూ.80 మాత్రమే వసూలు చేస్తుండటం గమనార్హం. ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియకు ఎంత వసూలు చేయాలో, ఇతర సేవలకు రుసుమెంతో తెలిపే బోర్డులు మీసేవా కేంద్రాల వద్ద లేకపోవడంతో సామాన్య ప్రజలు వారి దోపిడీకు గురవుతున్నారు

Updated Date - 2022-12-10T00:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising