ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
ABN, First Publish Date - 2022-01-13T05:39:28+05:30
నిద్రపోతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను అపహరించే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామని ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు.
ఏలూరు క్రైం, జనవరి 12: నిద్రపోతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను అపహరించే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామని ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారా వుపేట మండలం ఊసర్లగూడేనికి చెందిన సున్నం నాగేంద్రబాబు అలియాస్ నాగేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అనేక దొంగతనాలకు పాల్పడడంతో అనేక కేసులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం కోర్టు వాయిదాకు 2018లో వచ్చిన సమయంలో ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. రాత్రిపూట నిద్రిస్తున్న మహిళల మెడల్లో ఉన్న బంగారు ఆభరణాలను ఇనుప కట్టర్‌తో కట్‌చేసి క్షణాల్లో అపహరించడంలో సిద్ధమస్తుడు. ఇతనికి బాల్య స్నేహితుడైన ఆశ్వారావుపేట మండలం గోపన్నగూడేనికి చెందిన కలుం బాబూరావు(26) తన భార్య అనారోగ్య కారణం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నాగేం ద్రబాబుతో కలిసి దొంగతనాలకు పాల్పడేవాడు. ఈక్రమంలో దేవరపల్లి-తల్లాడ హైవేలోని జంగారెడ్డిగూడెం సమీపంలో కరాటం వై.జంక్షన్ వద్ద వీరిద్దరూ బైక్‌పై నాగేంద్రబాబు, బాబూరావు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 406 గ్రాముల బంగారు వస్తువులు, రెండు బైక్‌లు, 32 అంగుళాల టీవీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 23 లక్షలు ఉంటుందని అన్నారు. నిందితుఉలను అరెస్టు చేయడంలో సహకరించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎం.సాగర్‌బాబు, కొయ్యలగూ డెం ఎస్ఐ కె.సతీష్‌కుమార్, క్రైం పార్టీ ఏఎస్ఐ ఎన్.వి.సంపత్‌కుమార్, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు కె.రాము, బి.పండు, కె.సత్యనారా యణ, కానిస్టేబుల్ కె.మణికుమార్‌కు రివార్డులకు సిఫారసు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
Updated Date - 2022-01-13T05:39:28+05:30 IST