ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రపథాన నిలపాలి

ABN, First Publish Date - 2022-10-08T05:13:29+05:30

ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రపథాన నిలపాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెలికాన్ఫరెన్సలో డీఎంహెచవో డాక్టర్‌ మాలతి

ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 7: ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లాను అగ్రపథాన నిలపాలని దీనికి అంతా సమష్టిగా కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.మాలతి కోరారు. శుక్రవారం ఆమె చాంబర్‌లో జిల్లాలోని అన్ని పీహెచసీల వైద్యులు స్టాఫ్‌నర్స్‌లు, ప్రోగ్రాం అధికారులతో టెలీకాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 589 గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. ఇటీవలె పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తమ పంచాయతీల ఎంపికకు ఆయా గ్రామాల్లో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. 25 విభాగాల్లో గ్రామాల్లో థీంల ప్రకారం అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రూపొందించిన 25 అంశాల థీం ప్రకారం ఫార్మాట్‌ను నింపాల్సి ఉంటుందన్నారు. ఆరోగ్య శ్రీ కార్యక్రమాల అమలు, ఉమెన ఫ్రెండ్లీ పంచాయతీపై అమలుచేసిన అంశాలను ఆ ఫార్మెట్‌లో పొందుపరచాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్సలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సైదులు, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ పర్వతనేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising