ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుమ్మల హయాంలోనే సత్తుపల్లి అభివృద్ధి

ABN, First Publish Date - 2022-10-16T06:23:56+05:30

తుమ్మల హయాంలోనే సత్తుపల్లి అభివృద్ధి

తుమ్మలకు వినతిపత్రం అందిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రిని కలిసిన వేంసూరు మండల ప్రజలు

గ్రీనఫీల్డ్‌ హైవేలో లింగపాలెం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ ఇవ్వాలని వినతి

వేంసూరు, అక్టోబరు 15: ఖమ్మం-దేవరపల్లి గ్రీనఫీల్డ్‌ నేషనల్‌ హైవే రహదారిలో భాగంగా వేంసూరు-లింగపాలెం మధ్యలో సర్వీస్‌ రోడ్‌ కేటాయించాలని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును వేంసూరు మండల ప్రజలు వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి మండలం పాకలగూడెం వ్యవసాయ క్షేత్రంలో శనివారం తుమ్మలను కలిసిన మండల ప్రజలు వినతిపత్రం అందజేశారు. లింగపాలెం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ ఇవ్వాలని సుమారు వందమందికి పైగా ప్రజలు తుమ్మలను కోరారు. స్పందించిన తుమ్మల సంబంధిత అధికారులతో మాట్లాడి అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని, సర్వీస్‌ రోడ్‌ విషయమై కేంద్రమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సర్వీస్‌ రోడ్‌కు అనుమతి లభిస్తే అందుకు భూములు ఇచ్చేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నట్లు తుమ్మలకు చెప్పారు. 60కిలోమీటర్ల వరకు సర్వీస్‌ రోడ్‌ వస్తుందని, తన వంతు ప్రయత్నం చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొత్తా సత్యనారాయణ, పుచ్చకాయల సోమిరెడ్డి, వెల్ది జగన్మోహనరావు, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచలు ఎండీ.ఫైజుద్దీన, మేడా రమేష్‌, మాజీ సర్పంచ తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, ఎంపీటీసీలు నున్నా రాంబాబు, వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


‘తుమ్మల హయాంలోనే అభివృద్ధి’

సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మాజీమంత్రి తుమ్మల హాయంలోనే సాధ్యమైందని, వేంసూరు మండలం సస్యశ్యామలం అయ్యేందుకు తుమ్మల కృషి చాలా ఉందని వేంసూలు మండల ప్రజలు తెలిపారు. గ్రీనఫీల్డ్‌ నేషనల్‌ హైవే కూడా వచ్చిందని, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో రైతులకు త్వరితగతిన నష్టపరిహారం ప్రభుత్వం వేసేందుకు తుమ్మల కృషి మరువలేమన్నారు. నియోజకవర్గం మారుమూల ప్రాంతాలకు రహదారులను ఏర్పాటు చేసిన ఘనత తుమ్మలదేనని, అన్నివర్గాల నుంచి అభివృద్ధి చెందిందని, తాగునీరు, విద్య, వైద్యం, అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన తుమ్మల హయాంలోనే సాగిందని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-16T06:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising