ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్త మందలించిందని కోడలు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-04-04T04:51:28+05:30

పండించిన పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త గొడవ పడటంతో మనస్థాపం చెందిన కోడలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొతగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 11రోజులు మృత్యువుతో పోరాడి చివరికి మృతి 

 మృతురాలు ఐదు నెలల గర్బిణి 

గుండాల, ఏప్రిల్‌ 3: పండించిన పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త గొడవ పడటంతో మనస్థాపం చెందిన కోడలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొతగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన బోడ సరితకు(25) అదే గ్రామానికి చెందిన భద్రుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఇటీవల చేతికొచ్చిన మిర్చి పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త సువాలి  కోడలిని మందలించింది. ఇదే విషయమై రెండు వారాలక్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన సరిత పురుగుల మందుతాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తుండగా 11రోజులు పా టు మృత్యువుతో పోరాడి పరిస్థితి విషమిం చడంతో ఆదివారం ఉదయం మృతి చెందిం ది. మృతు రాలు ఐదు నెలల గర్బిణి కాగా ఆమెకు ఇప్పటికే రెండేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై గుండాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-04-04T04:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising