ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-09-13T06:01:55+05:30

ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు డీఈవో సోమశేఖర్‌శర్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో సోమశేఖర శర్మ

కొత్తగూడెం కలెక్టరేట్‌,  సెప్టెంబరు 12: ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు డీఈవో సోమశేఖర్‌శర్మ అన్నారు.  సోమవారం జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని సింగరేణి ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మౌలిక భాష, గణిత సామర్థ్యాలను పెంపొందించడంలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కృషి చేయాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణ అధికారులకు రెండు రోజుల శిక్షణా ఆయన ప్రారంభించారు. ప్రాఽథమిక పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, మౌలిక గణిత భావనలు తప్పనిసరిగా నేర్పించాల్సిన బాధ్యత ఆయా ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వం రూపొందించిన టాంజిరిన్‌ యాప్‌ను ప్రతి ఒక్కరు తమ మొబైల్‌లో డౌన్‌లోడు చేసుకొని దాని  ద్వారా పర్యవేక్షణను చేయాలన్నారు. ఈ యాప్‌ వినియోగంలో ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా శిక్షణను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోర్స్‌ డైరెక్టర్‌గా జిల్లా విద్యాశాఖ ఎకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి నాగరాజశేఖర్‌, రిసోర్‌్స్‌ పర్సన్‌గా టి రమ, కె శ్రీనివాసరావు, బి విష్ణుప్రియ, టి శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ రాజశేఖర్‌, వి కోటేశ్వరరావులు వ్యవహరిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో హాజరు రిజిస్టర్‌లో ఉన్నప్రతి విద్యార్థి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ చైల్డ్‌ ఇన్ఫో వెబ్సైట్‌లో తప్పని సరిగా నమోదు చేయాలని జిల్లా గణాంక అధికారి సతీష్‌ కుమార్‌ను ఆదేశించారు. 


Updated Date - 2022-09-13T06:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising