సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం
ABN, First Publish Date - 2022-12-07T00:26:06+05:30
తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా తానా మహాసభల నేపథ్యంలో చైతన్య స్రవంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి పేర్కొన్నారు. ఈనెల 2న ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి వేడుకలు జనవరి 7న ముగుస్తుండగా.. ఈ వేడుకల పర్యవేక్షణలో భాగంగా తానా బృందం మంగళవారం ఖమ్మంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో ఎనఆర్‌ఐల సహకారంతో రూ.4కోట్ల వ్య
తానా మహాసభల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో చైతన్య స్రవంతి వేడుకలు
ఖమ్మంలో సంఘం అధ్యక్షుడు అంజయ్య చౌదరి
ప్రతినిధులతో కలిసి లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్ల పరిశీలన
ఖమ్మం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా తానా మహాసభల నేపథ్యంలో చైతన్య స్రవంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి పేర్కొన్నారు. ఈనెల 2న ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి వేడుకలు జనవరి 7న ముగుస్తుండగా.. ఈ వేడుకల పర్యవేక్షణలో భాగంగా తానా బృందం మంగళవారం ఖమ్మంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో ఎనఆర్‌ఐల సహకారంతో రూ.4కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన శ్రీకృష్ణుడి అవతారంతోని 45 అడుగుల ఎన్టీఆర్ భారీవిగ్రహం ఏర్పాటు పనులను తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు జయశేఖర్, కాబోయే అధ్యక్షుడు శృంగవరపు నిరంజన తదితరులు పరిశీలించారు. అనంతరం అంజయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జూలై 7,8,9 తేదీల్లో అమెరికాలోని ఫిలడెల్పియాలో తానా మహసభలు జరగబోతున్నాయని, ఈ సంరద్భంగా తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్య స్రవంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పలు జిల్లాల్లో తానా బృందం పర్యటించి సంస్కృతి, సంప్రదాయాలు, జానపదాలతోపాటు నాటకోత్సవాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తానాతోపాటు తానా ఫౌండేషన, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. దివ్యాంగులకు మూడుచక్రాల స్కూటర్లు, సైకిళ్లు, పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నామని, అమెరికాలో చదువుకోసం, ఉద్యోగం కోసం వచ్చి ఇబ్బంది పడేవారికి సహకారం అందిస్తున్నామన్నారు. ఇందుకోసం తానా చేయూత స్కాలర్‌షిప్ పథకం అమలు చేస్తోందన్నారు.
రూ.4కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం
జయశేఖర్ తాళ్లూరి, తానా మాజీ అధ్యక్షుడు
ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌కు నివాళిగా.. ఖమ్మం లకారం చెరువు మధ్యలో ఎనఆర్‌ఐల సహకారంతో రూ.4కోట్ల వ్యయంతో 45అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని తానా మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా వాసి జయశేఖర్ తాళ్లూరి పేర్కొన్నారు. 2018లో తాను తానా అధ్యక్షుడిగా ఖమ్మం వచ్చినప్పుడు లకారం చెరువును పరిశీలించానని, హైదరాబాద్ హుస్సేనసాగర్ ట్యాంక్‌బండ్ వద్ద భారీ గౌతమబుద్ధుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ ఏర్పాటుచేశారని, అదేస్ఫూర్తితో తాము ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మం ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.4కోట్లు సేకరించి ఏర్పాటుచేస్తున్న ఈవిగ్రహాన్ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ వేడుకకు రాష్ట్రంలోని సినీ ప్రముఖులంతా హాజరవుతారని తెలిపారు. ఖమ్మం లకారం చెరువును అభివృద్ధి చేస్తున్నందుకు మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. తానా కాబోయే అధ్యక్షుడు శఽృంగవరపు నిరంజన మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, తానా ఆధ్వర్యంలో గతంలో ఖమ్మంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లా ఖమ్మం లకారం చెరువు అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగర కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని రామరావు, సరిపూడి సతీష్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కొత్తపల్లి నీరజ, మాజీ డిప్యూటీమేయర్ బత్తుల మురళి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:26:07+05:30 IST