ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడులో బీజేపీ ఓటమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-15T08:26:52+05:30

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పార్టీని ఓడించే పార్టీతోనే జత కడతాం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

వైరా, ఆగస్టు 14: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలను విశ్లేషించి సీపీఎం మద్దతు ఎవరికివ్వాలో నిర్ణయించి ప్రకటిస్తామని వెల్లడించారు. ముసలిమడు గులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక హాట్‌టాఫిక్‌గా మారిందని, ఇది మామూలు పరిస్థితుల్లో వచ్చిన ఉప ఎన్నిక కాదన్నారు. కార్పొరేట్‌ సంస్థల స్పాన్సర్‌ డబ్బుతో రాజ కీయాలు పూర్తిగా విషపూరితమైన స్థితిలోకి వెళ్లిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థల డబ్బుతో రాజకీయాలు కలుషితమ య్యాయని విమర్శించారు. ముసలిమడుగులో సీపీఎం సీనియర్‌ నాయకుడు నర్వనేని సత్యనారాయణ ప్రథమ వర్థంతి సభ ఆదివారం జరిగింది. ఈ సభలో తమ్మినేని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ పతాకాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆవిష్కరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంక టేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, సమత, నాయకులు తోట నాగేశ్వర రావు, సుధాకర్‌, కవి సీతారాం, దూళిపాళ్ల నాగేశ్వరరావు, మణి, కృష్ణ, జాన్‌పాపయ్య, షేక్‌.మోహిద్దీన్‌, చింతనిప్పు కృష్ణార్జున్‌రావు, చలపతిరావు, విద్యాసాగర్‌రావు, పారుపల్లి కృష్ణారావు, కుటుంబరావు, మాదాల వెంకటేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జున్‌రావు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T08:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising