ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల వలయంలో సుజాతనగర్‌

ABN, First Publish Date - 2022-12-17T22:47:11+05:30

‘అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని‘ అన్న చందంగా ఉంది ప్రస్తుతం సుజాతనగర్‌ పంచాయతీ దుస్థితి

అంబేద్కర్‌నగర్‌లో డ్రైనేజీని చూపుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ

యఽథేచ్చగా ఆక్రమణ

మిగులు బడ్జెట్‌ ఉన్నా అభివృద్ధి సున్నా

పట్టించుకోని అధికారులు

సుజాతనగర్‌, డిసెంబరు 17: ‘అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని‘ అన్న చందంగా ఉంది ప్రస్తుతం సుజాతనగర్‌ పంచాయతీ దుస్థితి. మండలంలోనే అతిపెద్ద పంచాయతీ సుజాతనగర్‌. అధిక రాబడి, మిగులు బడ్జెట్‌తో ఉన్న సుజాతనగర్‌ సమస్యల వలయంలో చిక్కుకొని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది.

అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ

పేరుకే నగరం అంతా ఎటు చూసినా డ్రైనేజీ దుర్వాసన వస్తోంది. అభివృద్ధి పేరిట, మిషన్‌ భగీరఽథ పైపుల కోసం తీసిన గోతులతో, రహదారులు అస్తవ్యస్తంగా తయార య్యాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్వహిస్తున్న పనుల వల్ల మురుగునీటి వసతులు లేక వీధులు దుర్వాసన వెదజల్లు తున్నాయి. డ్రెయినేజీ స్థలాల ఆక్రమణ యథేచ్చగా జరుగుతున్నా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తు న్నారు. శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, రైతు వేదికలు, నర్సరీల మీద ఉన్న శ్రద్ద పంచాయతీలోని పనుల మీద లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ప్రజలు గుస గుస లాడుకుంటున్నారు. పంచాయతీలోని వేపలగడ్డ గ్రామంలో అకిట్స్‌ ప్రాంతంలో డ్రైనేజీ నీరు, వర్షపు నీరు రోడ్‌ మీద నిలిచి, గ్రామస్థులకు, విద్యార్థులకు అసౌకర్యం కలుగుతున్నా, ఇప్పటి వరకు అక్కడ శాశ్వత పరిష్కారం చేయలేదని, అదే విధంగా గొల్లగూడెంలో సీసీ రోడ్లు వేసినా అక్కడా డ్రైనేజీ లేక మురికి నీరు రోడ్లపైనే నిలుస్తొంది. అదే విధంగా మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో వర్షం వస్తే మూడు అడుగుల లోతు నీరు రోడ్‌పైనే నిలుస్తున్నాయి. కేశవాపురం, అంబేద్కర్‌ నగర్‌, సిరిపురం ఇలా ప్రతి చోట మురుగు కాలువల వల్ల ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిపాలన సక్రమంగా లేదని పంచాయతీ ప్రజలు పాలకులపై అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ముందుగా నగరంలో మురుగునీరు, పారిశుధ్యంపై పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-17T22:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising