ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమం

ABN, First Publish Date - 2022-06-11T06:13:42+05:30

భక్తి ప్రపత్తులతో సుదర్శన హోమం

సుదర్శన హోమం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం జూన్‌ 10: భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సుదర్శన హోమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ప్రతి నెల చిత్తా నక్షత్రం రోజున సుదర్శన పెరు మాళ్‌ కు సుదర్శన హోమం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సీతారామచంద్ర స్వా మి, సుదర్శన స్వామివారిని మేళతాళాలతో యాగశాలకు తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ ఈ క్ర మంలో ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యా వచనం, కంకణ ధారణ, సుదర్శన కలశ స్థాపన, హవనం, పూర్ణాహుతి, ఆశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన స్వామికి ప్రసాదం నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కావడంతో శ్రీ సీతారామచంద్ర స్వామి మూ లవర్లకు స్వర్ణ కవచధారణ చేయడంతో ఈ సమయంలో స్వామివారిని భక్తులు దర్శించారు.

ఏపీ మున్సిపల్‌ అడ్మినిరేస్టషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్థంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శాలువా, స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రవీణ్‌ కుమార్‌ బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - 2022-06-11T06:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising