ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతివేగం అనర్థాలకు మూలం

ABN, First Publish Date - 2022-11-24T00:04:36+05:30

రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోడ్డు ప్రమాదా లపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

ఖమ్మం లీగల్‌, నవంబరు 23: రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, కారణాలపై న్యాయమూర్తి బుధవారం న్యాయసేవాసదన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి గంటకు 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తూ అతివేగం, నిర్లక్ష్యం, జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఎ క్కువగా జరుగుతున్నాయన్నారు. ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మనసు ఆందోళన తో ఉన్నప్పుడు వాహనం నడపవద్దని, అది ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు. వాహన యజమాని తప్పనిసరిగా వాహనానికి బీమా చేయించాలని, డబ్బులు మిగులుతా యని భావించి బీమాను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలించేందు కు వెనకాడవద్దని, అటువంటి సమాజహితం కల వ్యక్తిని చట్టం గౌరవిస్తుందేకాని ఇబ్బందుల పాలు చేయదని వివ రించారు. వాహనానికి తగిన బీమా లేక రోడ్డు ప్రమాదానికి కారణమైన ఒక కేసులో వాహన యజమాని రూ.24 లక్షలు చెల్లించిన విషయాన్ని న్యాయమూర్తి ఈ సందర్బంగా వివరించారు. న్యాయసేవాసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌జావీద్‌పాషా, ప్రాంతీయ రవాణా అధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోడ్డు ప్రమాదా లపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు.

Updated Date - 2022-11-24T00:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising