ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-12-05T00:09:24+05:30

రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పీవీగౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నేలకొండపల్లిలోని బౌద్దస్ధూపం వద్ద ధాన్యం కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్ళలో అధికారులు ఏమైౖనా ఇబ్బందులు పెడుతున్నారా?అంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు.

నేలకొండపల్లిలో ధాన్యాన్ని పరిశీలిసున్న కలెక్టర్‌ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పీవీగౌతమ్‌

నేలకొండపల్లి, డిసెంబరు4: రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పీవీగౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నేలకొండపల్లిలోని బౌద్దస్ధూపం వద్ద ధాన్యం కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్ళలో అధికారులు ఏమైౖనా ఇబ్బందులు పెడుతున్నారా?అంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు వ్యాపారులకే రైతులు ఎక్కువగా ధాన్యం అమ్ముతున్నారంటూ కొందరూ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళగా ఎందుకు అలా జరుగుతున్నదని అడిగారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, మనం నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాల్సి వస్తున్నదని అధికారులు కలెక్టర్‌కు చెప్పారు. జేసి మధుసూధన్‌, జేడీఏ, డీసీఓ, సివిల్‌ సప్లై అధికారులు, ఆలస్యం మధుసూధన్‌రావు, తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, ఏఓ నారాయణరావు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

ఓటర్ల నమోదు అమలును పరిశీలించిన కలెక్టర్‌

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు4: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలును కలెక్టర్‌ గౌతమ్‌ పరిశీలించారు. ఆదివారం నగరంలోని జిల్లా విద్యాశాఖ, అటవీశాఖ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. బూత్‌లెవల్‌ అధికారులు సూపర్‌వైజర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. కలెక్టర్‌ గొల్లబజారులో ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉన్నదీ 17 ఏళ్లు నిండిన వారు కొత్తగా వివాహం అయి వచ్చిన వారు, ఓటు హక్కు ఎంత మందికి ఉన్నదీ లేని వారు నమోదు చేసుకున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ తనిఖీలలో ఖమ్మం మునిసిపల్‌ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాధిక గుప్తా, ఖమ్మం అర్భన్‌ తహసీల్దారు శైలజ బూత్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising