ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా మరింత మెరుగుపడేలా చర్యలు
ABN, First Publish Date - 2022-03-06T03:52:15+05:30
సింగరేణి కాలరీస్‌లో ఉపరితల గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం అవసరమైన ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా మరింత మెరుగుపడేందుకు దోహదపడేలా నూతన టెండర్ ప్రక్రియను చేపట్టినట్టు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్. చం ద్రశేఖర్ చెప్పారు.
ప్రీ బిడ్ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్
కొత్తగూడెం, మార్చి 5: సింగరేణి కాలరీస్‌లో ఉపరితల గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం అవసరమైన ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా మరింత మెరుగుపడేందుకు దోహదపడేలా నూతన టెండర్ ప్రక్రియను చేపట్టినట్టు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్. చం ద్రశేఖర్ చెప్పారు. ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా కాంట్రాక్ట్ విషయంలో కోలిండియా తదితర సంస్థల్లో అవలంభిస్తోన్న విధానాలను పరిశీలించిన అనంతరం అత్యంత పారదర్శకతతో పూర్తి హేతు బద్ధతతో పలు నిబంధనలను కొత్త టెండర్‌లో పొందుపరుస్తు న్నట్లు ఆయన వివరించారు. ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరాదార్లతో శని వారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ప్రీ బిడ్ సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఎక్స్‌ప్లోజీవ్స్ సరఫరా కంపెనీలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి స మస్యలను అధ్యయనం చేసిన తర్వాత పని తీరు ఆధారిత టెం డర్ ఆహ్వాన నోటీస్ (ఎన్‌ఐటీ)లో పలు నిబంధనలు చేర్చినట్లు వివరించారు. నిర్ణీత స్థాయిలో సరఫరా చేయని పక్షంలో పెనా ల్టీ విధించడాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-03-06T03:52:15+05:30 IST