ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదు: షర్మిల

ABN, First Publish Date - 2022-04-23T18:12:17+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం అశ్వాపురం మండలం, గొంధిగూడెం గ్రామంలో రైతు గోస ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం అంటూ లేదని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు..విత్తనాలపై సబ్సిడీ లేదు..కనీసం బోర్లు వేసుకునేందుకు సహాయం కూడా లేదని విమర్శించారు. ఒక్క రైతు బందు ఇచ్చేస్తే రైతులు కోటీశ్వరులు అయినట్లా? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ. 25 వేలు సహాయం అందించే పథకాలను పక్కన పెట్టి.. రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా? అని నిలదీశారు. కౌలు రైతు అసలు ముఖ్యమంత్రికి కనపడటం లేదన్నారు. పంట నష్టం జరిగితే కనీసం నష్ట పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ మళ్ళీ గారడీ మాటలతో.. దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తారని, దళిత బంధుతో పాటు ఎస్సీ బంధు, బీసీ బంధని దొంగా హామీలు చెప్పేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఈ సారైనా ప్రజలు సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని సూచించారు. ‘నేను వైఎస్సార్ బిడ్డను.. తెలంగాణ పక్షాన పోరాటం కోసం... నిలబడటం కోసం పార్టీ పెట్టా..’నని షర్మిల వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-23T18:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising