ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు: షర్మిల

ABN, First Publish Date - 2022-04-24T18:35:55+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం అశ్వాపురం మండలం, గొల్లగూడెం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పినపాక నియోజక వర్గంలో అడుగడుగునా పోడు సమస్య ఎదురవుతుందన్నారు. ఎకరాకు రూ. 5 వేలు రైతు బందు ఇచ్చి 25 వేల పథకాలు నిలిపివేశారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం కూడా తెలంగాణలో దిక్కు లేదన్నారు. పంట నష్ట పోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట భీమా ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.


7 గంటలు కరెంట్ ఇస్తే పంట ఎండిపోతుందని మనస్తాపం చెందిన మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని షర్మల అన్నారు. పంట ఎండిపోతుంటే తెచ్చిన అప్పులు ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆ మహిళా రైతు ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. గత 6 నెల్లలో రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి నాలుకకు నరం లేదని, ఒక సారి ఓ మాట.. మరో సారి మరో మాట మాట్లాడతారని.. దీంతో రైతులు ఆగం అవుతున్నారన్నారు. రైతులు కూడా సీఎం కాళ్ళ దగ్గర బాంచెన్ అని పడి ఉండాలా..? అని షర్మిల ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-24T18:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising