ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ విజృంభణ

ABN, First Publish Date - 2022-08-04T07:23:02+05:30

సీజనల్‌ విజృంభణ

మాతాశిశు కేంద్రంలో బారులు తీరిన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల రద్దీ

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 3: సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచసీలు, యూపీహెచసీలతో పాటు అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ పెరుగుతోంది. వర్షాలు పడడం, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ పరిస్థితులు దాపురిస్తుయని, అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నా పరిస్థితి జటిలమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిరోజులుగా రోజుకు 1500 నుంచి 2వేల మంది వరకు రోగులు వస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో జనరల్‌ ఫిజీషియన వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికశాతం ఆసుపత్రిలో చేరుతుండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని మహిళ, పురుష విభాగాల్లోని పడకలు నిండిపోతున్నాయి. ఇక మాతాశిశు సంరక్షణ కేంద్రానికి కూడా గర్భిణులు, బాలింతలు బారులు తీరుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులు, చిన్నప్లిల వైద్యశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్నారులు జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో వస్తున్నారు. చాలా ఆస్పత్రులో ప్లేట్‌లెట్స్‌ తగ్గిన రోగులు చికిత్సలు పొందుతుండగా, దగ్గు, ఆయాసంతో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 


అన్ని పరీక్షలు చేయిస్తున్నాం

డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పక్షం రోజులుగా ఓపీ పెరిగుతోంది. జ్వరాలు, జలుబు, దగ్గు వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో రోగులు వస్తున్నారు. అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. జ్వరాలతో వస్తున్న వారికి కొవిడ్‌ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాం. వైద్యులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతున్నాం. అందరికీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.


గత పది రోజులుగా జిల్లా ఆస్పత్రిలో చేరికలు ఇలా..

--------------------------------

తేదీ ఓపీ ఐపీ

--------------------------------

జూలై25 1748 179

26 1523 137

27 1608 168

28 1502 125

29 1602 168

30 1667 135

31 279 90

ఆగస్టు1 2013 203

2 1529 140

3 1643 121



Updated Date - 2022-08-04T07:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising