ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీజనల్‌’పై సన్నద్ధతేదీ?

ABN, First Publish Date - 2022-06-15T05:06:17+05:30

‘సీజనల్‌’పై సన్నద్ధతేదీ?

డెంగ్యూ రోగులకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే ఎస్‌డీపీ (సింగిల్‌డోనర్‌ ప్లాస్మా) మిషన ఇది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగ నిర్ధారణ పరీక్షలకు కానరాని పూర్తిస్థాయి ఏర్పాట్లు 

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో పనిచేయని డెంగ్యూ పరీక్ష పరికరాలు

ఏడాదిగా మూలన పడిన ఆటోమేటిక్‌ హిమటాలజీ అనలైజర్‌

టీహబ్‌కు రాని రీ ఏజెంట్స్‌.. పట్టించుకోని వైద్యఆరోగ్య అధికారులు

ఖమ్మం కలెక్టరేట్‌, జూన 14: వానాకాలం.. సీజనల్‌ వ్యాధులు ప్రబలే కాలం. జనం జలుబు, జ్వరాల బారిన పడే సమయం. ఇలాంటి సమయంలో సమర్థవంతంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ వానాకాలం వచ్చినా ఇంత వరకు ఖమ్మం జిల్లా ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది రోగులకు సేవలందించేందుకు ఇంకా సిద్ధంగా లేరని, సీజనకు తగినట్టు, రోగుల రద్దీకి తగినట్లు ఇక్కడ ఏర్పాట్లపై ఇంకా అధికారులు దృష్టిపెట్టలేదని ఆస్పత్రిలో ఎక్కడి మిషన్లు అక్కడే ఉండటం, పనిచేయకుండా మొరాయించడం లాంటివి చూస్తే అర్థమవుతోంది. కొవిడ్‌ నేపథ్యంలో జిల్లాలో రెండేళ్లుగా డెంగ్యూ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. అయినా గతేడాది కల్లూరు మండలంలో కల్లూరులో డెంగ్యూ కేసులు 50వరకు నమోదయ్యాయి. రెండేళ్లక్రితం చింతకాని, బోనకల్‌ మండలాల్లో డెంగ్యూ ప్రబలి ప్రాణనష్టం కూడా భారీగా సంభవించింది. అంతే కాదు ఆ ఏడాది ఏ ఆస్పత్రిలో చూసినా డెంగ్యూ కే సులే. ఎంతో మంది రూ.లక్షలకు లక్షలు ఖర్చుచేసి ఆర్థికంగా ఇబ్బందులు పడిన సంఘటనలున్నాయి. అలాంటి చేదు అనుభవాలను మళ్లీ ఈ సీజనలో చూడకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అంటే లేదనే సమాధానాలే వినిపిస్తున్నాయి. 


పరీక్షలపై కానరాని పట్టింపు

మలేరియా, టైపాయిడ్‌, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి కేసులకు రక్తనమూనాలను సేకరించాల్సి ఉంటుంది. సీజనలో తరచుగా ప్రజలు వీటి బారిన పడుతుంటారు. అలాంటి కిట్‌ మెథడ్‌ ద్వారా టైపాయిడ్‌, వైడాల్‌ పరీక్ష ద్వారా టైఫాయిడ్‌, ఎలీసా ద్వారా డెంగ్యూ, ర్యాపిడ్‌ మెథడ్‌ ఎలీసా ద్వారా చికున్‌గున్యా జ్వరాలను నిర్ధారిస్తుంటారు. వీటిని నిర్ధారించాలంటే ప్రైవేటు డయాగ్నొసిస్‌ కేంద్రాల్లో ఒక్కో రోగి కనీసం రూ.1500 నుంచి రూ.2500 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.  మరి జిల్లా ఆస్పత్రిలో ఆటోమేటిక్‌ ఎమటాలజీ అనలైజర్‌ మిషన మూలన పడి ఏడాది కావస్తోంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. ఒక రోగికి ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ క్షణ క్షణాకి తగ్గిపోతుంటాయి. ఇలాంటి సందర్భంలో నిర్ధారణ పరీక్షలు తక్షణమే తెలియాల్సి ఉంటుంది. వాటిని నిర్వహించడానికి జిల్లా ఆస్పత్రిలో అవకాశం లేకుండా పోయింది.


డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు 

జిల్లా ఆస్పత్రిలో వైరాలజీ, ఆస్పత్రి ల్యాబ్‌లో కేవలం డెంగ్యూనిర్ధారణ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. బయట డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో వీటిని నిర్వహించడం లేదు. ప్రస్తుతం ప్లేట్‌లెట్‌ రిచ కాన్సన్‌ట్రేటర్లు, ప్లేట్‌లెట్‌ రిచ ప్లాస్మా ద్వారానే ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తున్నారు. ఈ విధానంలో చాలా తక్కువగా ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ ఎక్కడంతో పాటు చాలా జాప్యం అవుతూఉంటుంది. వాస్తవానికి ప్లేట్‌లెట్స్‌ పడిపోయే వారికి అత్యవసరంగా ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది. వైద్యులు, చికిత్స పరికరాలు అందుబాటులో ఉంటేనే వైద్యం అందించి ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇక సింగిల్‌ డోనర్‌ ప్లాస్మా కిట్లు జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో లేవు. ఇది అందుబాటులో ఉంటే ప్రతి సీజనలోనూ డెంగ్యూ బారిన పడిన వారికి ప్లాస్మా ఎక్కించి ప్రాణాలునిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇది ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకుంటే రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తుంటారు. డెంగ్యూతో పాటు ఇతర జ్వరాలు వచ్చిన వారికి సాధారణంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోయి అసాధారణంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతే ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది. ఎనడీపీ యంత్రం అందుబాటులో ఉంటే రోగికి కావాల్సిన రక్తదాతనుంచి నేరు గా ప్లాస్మాను తీసి తక్షణమే ఎక్కించే అవకాశం ఉంటుంది. ఈ యంత్రం కోసం గతంలో టెండర్లు నిర్వహించినా తర్వాత దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా సింగిల్‌డోనర్‌ ప్లేట్‌లెట్‌ యంత్రాన్ని ఆస్పత్రికి సమకూర్చాలని కోరుతున్నారు.


టీ హబ్‌లో రీ ఏజెంట్స్‌ కొరత..

టీ హబ్‌తో రాష్ట్రంలోని ప్రజలకు 53రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామంటూ గతేడాది వీటిని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఆరంభ శూరత్వమే అన్నట్లు ప్రారంభించి ఏడాది తిరక్కుండానే వీటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా ఆస్పత్రిలో టీహబ్‌లో గర్భిణులకు అత్యవసరమైన థైరాయిడ్‌ డయాబెటిక్‌, బయోకెమిసీ్ట్ర, రీఏజెంట్స్‌ (రసాయనాలు) సరఫరా కాక మూడు నెలలు కావస్తోంది. దీంతో ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు టీహబ్‌లో ఉచితంగా పరీక్షలు చేస్తారని ప్రచారంతో చైతన్యవంతులైన ప్రజలు ఇక్కడ చేయడం లేదనిచెబుతుంటే వాదనలకు దిగుతున్నారని వైద్యులు వాపోతున్నారు. ప్రైవేటుకు ఎందుకు రాస్తున్నారంటూ గొడవ పడుతున్నారని టీహబ్‌కు రీఏజెంట్లు రాక.. రోగులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నామంటూ వైద్యులు వాపోతున్నారు. టీహబ్‌ సిబ్బంది మాత్రం తాము రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, టీహబ్‌ సమన్వయకర్తలకు సమాచారాన్ని అందిస్తున్నామని చెబుతున్నారు. దీంతో ఇక్కడ నామమాత్రపు పరీక్షలు తప్ప రోగలుకు అవసరమైన పరీక్షలు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యాధుల సీజన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యాధికారులు రోగులకు ఇక్కట్లు లేకుండా చూడాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-06-15T05:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising