ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గులాబీ’ సంబురం

ABN, First Publish Date - 2022-10-07T06:25:32+05:30

‘గులాబీ’ సంబురం

ఖమ్మం జడ్పీ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ నేతల సంబరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఆర్‌ఎస్‌ ప్రకటనతో ఉమ్మడిజిల్లా శ్రేణుల హర్షం

ఖమ్మం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రసమితి పేరుతో రాష్ట్ర సాధన ఉద్యమం, ఆతర్వాత జరిగిన చట్టసభలు, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలను అందుకున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్‌)గా ఆవిర్భవించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌ భారతరాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన చేయడంతో ఉమ్మడిజిల్లా నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఎదుట, జడ్పీ సెంటర్‌లో నాయకులు, మహిళా, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు ‘జై కేసీఆర్‌, జైబీఆర్‌ఎస్‌’ అంటూ నినాదాలు చేశారు. జిల్లాపార్టీ కార్యాలయం ముందు సంబరాలు నిర్వహించారు. సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, నగర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పగడాల నాగరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, నాయకులు గుండాల కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, కార్పొరేటర్లు, పలువురు ఉద్యమకారులు బీఆర్‌ఎస్‌ ముద్రలతో ఉన్న కండవాలు వేసుకుని, జెండాలు చేతపట్టి ఆవిర్భావ ఉత్సవాల్లోపాల్గొన్నారు. అలాగే మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గ, మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. రవాణాశాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదనతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనల్లో తమ హర్షం ప్రకటించారు.


కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం : ఎంపీ నామ

దేశానికి కేసీఆర్‌ నాయత్వం అవసరం ఉందని, అందుకే బీఆర్‌ఎ్‌సను స్థాపించారని టీఆర్‌ ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి నవశకానికి నాంది పలికారని, ప్రజాస్వామ్య దేశంలో ఇదొక కీలక ఘట్టమన్నారు. పార్టీ పేరు మార్పుతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ నలుమూలలనుంచి కేసీఆర్‌కు శుభాకాంక్షలు అందుతున్నాయని, ఇది దేశ రాజకీయల్లో కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. విజయ దశమి పండుగ రోజున పార్టీ ఆవిర్భవించడం శుభసూచకమని, 21 ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌ ప్రస్థానం రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరని, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రస్థానం దేశ అభివృద్ధికి, దేశరాజకీయాలకు దశ,దిశగా మారనుందన్నారు. సాగు, తాగునీరుతోపాటు దేశ అభివృద్ధి, సంక్షేమపథకాలు కేసీఆర్‌ సారథ్యంలో సాధ్యమవుతుందని, మిషన్‌ భగీరథ, మిషనకాకతీయ, రైతుబంధు రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత, హరితహారం లాంటి పథకాలు కేసీఆర్‌ ద్వారా దేశ ప్రజలకు అందుతాయన్న విశ్వాసం ఉందన్నారు. 


నవశకానికి నాంది: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర 

భారత రాష్ట్రసమితి ఏర్పాటు దేశరాజకీయాల్లో నవశకానికి నాంది అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎందరో మహానుభావులను ఎదిరించి ఎందరో త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి అందించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాటుచేశారని, దేశ అభివృద్ధిలో కేసీఆర్‌  కీలకపాత్ర పోషించబోతున్నారని, బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలవబోతోందన్నారు. 

Updated Date - 2022-10-07T06:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising