ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ హాస్టల్లోకి వాననీరు

ABN, First Publish Date - 2022-08-04T07:24:25+05:30

ఎస్సీ హాస్టల్లోకి వాననీరు

వసతి గృహంలోకి చేరిన నీటిని బకెట్లలోకి ఎత్తుతున్న విద్యార్థులు,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రంతా నిద్రలేక అవస్థలుపడ్డ చండ్రుగొండ హాస్టల్‌ బాలురు 

విద్యార్థులతోనే నీటిని ఎత్తిపోయించిన సిబ్బంది 

తీరిగ్గా ఉదయం వసతి గృహానికి వచ్చిన వార్డెన

చండ్రుగొండ, ఆగస్టు 3: భారీవర్షంతో హాస్టల్‌ గదు ల్లోకి చేరిన వర్షం నీటితో విద్యార్థులు రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన ఘటన చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి హాస్టల్‌లోకి నీరు చేరగా రాత్రంతా విద్యార్థులు నిద్రలేకుండా తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు మెరుపులు, ఉరుముతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేయాల్సిన హాస్టల్‌ వార్డెన్‌ స్థానికంగా నివాసం ఉండకపోవటంతో విద్యార్థులు సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. ఇదిలా ఉండగా గదుల్లోకి నీరుచేరి రాత్రంతా నిద్రలేకుండా ఉన్న విద్యార్థులతోనే ఆ నీటిని ఎత్తిపోయిం చడం గమనార్హం. మీడి యా ప్రతినిధులు అక్కడికి చేరుకొని ఫొటోలు తీస్తుండటంతో హాస్టల్‌ సిబ్బంది విద్యార్థులతో నీటిని ఎత్తించే పనిని నిలిపేశారు. తీరికగా బుధవారం ఉదయం వసతిగృహానికి చేరుకున్న వార్డెన హాస్టల్‌ గదుల్లోని మిగతా నీటిని తొలగించే ప్రయత్నం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్‌ హాస్టల్‌ను పరిశీలించారు. వర్షం నీరు వెళ్లిపోయేందుకు డ్రైయినేజీ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులతో నీటిని ఎత్తించటంపై ఆయన స్పదిస్తూ ఈ ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.



Updated Date - 2022-08-04T07:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising