రేగా మీడియా వారియర్స్ నిర్వాకం
ABN, First Publish Date - 2022-08-05T05:19:32+05:30
సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చెందిన ‘రేగా యూత్’ సోషల్ మీడియా వారియర్స్’ ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి.
జాతీయజెండాను మూసేలా ఎమ్మెల్యే ఫోటో ఏర్పాటు
జెండాలోని తెలుపు రంగుపై గులాబీ వర్ణం
ఎలకా్ట్రనికి మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
ఆ పోస్టింగ్ తొలగించాలని ఎమ్మెల్యే రేగా సూచన
మణుగూరు, ఆగస్టు 4: సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చెందిన ‘రేగా యూత్’ సోషల్ మీడియా వారియర్స్’ ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఎక్కడో అంథోల్ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ జాతీయ జెండాతో రూపిందించిన పోస్టింగ్‌ను రేగా యూత్, సోషల్ మీడియా వారియర్స్ సభ్యులు అభ్యంతరకరంగా మార్పులు చేశారు. ఎమ్మెల్యే రేగా కాం తారావు ఫొటోను జాతీయ జెండాపైకి వచ్చేలా ఏర్పాటు చేయడమే కాకుండా జెండా మధ్యన ఉండే తెలుపు రంగుపై గులాబీ వర్ణాన్ని అద్ది పోస్టు చేశారు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. భద్రాద్రి జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటన టీవీల్లో రావడంతో దుమారం రేగింది. జాతీయ జెండాను అవమానించారనే వార్తలు ప్రముఖం గా ప్రసారం అయ్యాయి. ఈ పొరపాటును మీడియా ద్వారా తెలుసుకున్న సీతంపేట యూత్ సభ్యులు ఆ ఫొటో కు ఎమ్మెల్యే రేగాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నా రు. అంతే కాకుండా ఎమ్మెల్యే రేగాపై ఉన్న అభిమానం తో ఫొటోను అలా ఎడిట్ చేశానని, సరిగా చూ సుకోకపొవడం వల్ల జాతీయ జెండాలో కలర్ మారిందని యూత్ సభ్యు డు పూసా సంతోష్ పోస్టిం గ్ పెట్టాడు. తన తప్పును క్షమించాలని కోరాడు. సా యంత్రం 3గం టల ప్రాంతంలో ఎమ్మెల్యే రేగా కూడా తన ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయంపై స్పం దిస్తూ ‘‘మిత్రులారా మన వాళ్లు ఎవరైనా జాతీయ జెండా మధ్యలో తెల్లని రంగు స్థానంలో గులాబీరంగు అద్దితే వెంటనే తీసేయండి.. ఈ విషయం టీవీల్లో వస్తోంది’’ అని పోస్టు పెట్టారు.
సోషల్ మీడియాలో ఆగడాలకు హద్దూ అదపూ లేకుండా పొతోంది
ఇటీవల కాలంలో రేగా అభిమానులు సోషల్ మీడియా లో ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యాఖ్యలు.. పోస్టింగ్ లు.. వ్యక్తిగత విమర్శలు పరాకాష్టకు చేరుతున్నాయి. కొందరు యూత్ సభ్యులైతే ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యే రేగా పేరును వాడేస్తున్నారు. తాము చేసే పనిలో మంచి చెడులను ఆలోచించకుండా వీరు చేస్తున్న ఆగడాల పోస్టింగ్‌లు కొందరికి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. తన సోషల్ మీడియా సభ్యులను ఎమ్మెల్యే రేగా అదుపు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయ న్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేయొద్దని స్వయంగా ఎమ్మెల్యే రేగా పోస్టింగ్ పెట్టారంటే రేగా సోషల్ మీడియా సభ్యులు ఏ స్థాయికి చేరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్య క్రమాలు, మంత్రుల పర్యటనల సందర్భంలో విలేకరులు మీడియా చానల్స్ కంటే రేగా యూత్ సోషల్ మీడియా సభ్యుల హడావిడే ఎక్కువవుతోంది. కొన్ని సందర్భాల్లో మీడియానే వారికంటే వెనుక ఉండిపోవాల్సిన పరిస్థతి పినపాక నియోజకవర్గంలో నెలకొంది. గాడి తప్పిన రేగా సోషల్ మీడియా వ్యవస్థ వల్ల ఎమ్మెల్యే రేగాకు తల నొప్పిగా మారిందని కొందరు నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తన ఎదుగుదల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇలా తప్పుదారిన వెళుతున్నా ఎమ్మెల్యే కుగా గ్రహించకపోవడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.
Updated Date - 2022-08-05T05:19:32+05:30 IST