ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం: తెలంగాణ రైతుసంఘం
ABN, First Publish Date - 2022-01-20T04:59:40+05:30
కార్మిక కర్షకుల సమస్యలు పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలే శరణ్యమని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వ్యవసాయకార్మికసంఘం రాష్ట్ర కమిటి సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ అన్నారు.
కొణిజర్ల, జనవరి 19: కార్మిక కర్షకుల సమస్యలు పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలే శరణ్యమని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వ్యవసాయకార్మికసంఘం రాష్ట్ర కమిటి సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ అన్నారు. మండల పరిధిలోని సింగరాయపాలెంలో రైతుసంఘం, వ్యవసాయకార్మికసంఘం, సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం కార్మిక,కర్షక మైత్రి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలకు న్యాయం జరగాలంటే ఐక్య ఉద్యమాలు ద్వారానే సాద్యమని తెలిపారు. రాష్ట్రంలో మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21న ఉద్యాన కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి ఎరమల్ల మాధవరెడ్డి, సీఐటీయు జిల్లా కమిటి సభ్యులు అనుమోలు రామారావు, నాయకులు దొడ్డపునేని కృష్ణార్జున్‌రావు, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యం, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T04:59:40+05:30 IST