ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28న భద్రాద్రికి రాష్ట్రపతి

ABN, First Publish Date - 2022-12-15T01:01:28+05:30

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం విచ్చేయనున్నారు. తెలుగు రాషా్ట్రల పర్యటనలో భాగంగా 28న ఉదయం 10.40కి భద్రాచలానికి రానున్న ఆమె భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామయ్యను దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము

భద్రాచలం, డిసెంబరు 14: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం విచ్చేయనున్నారు. తెలుగు రాషా్ట్రల పర్యటనలో భాగంగా 28న ఉదయం 10.40కి భద్రాచలానికి రానున్న ఆమె భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. అలాగే పర్యాటకశాఖ ప్రసాద్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు సంబంధించి వర్చువల్‌ ఇనాగ్రేషనను చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్యను 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన దర్శించారు. ఈ సమయంలో ఆయన గోదావరిపై భద్రాచలం వద్ద నిర్మించిన వారధిని ప్రారంభించారు. మళ్లీ 57ఏళ్ల అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం వస్తుండటం విశేషం. ఈ సమాచారం భద్రాద్రి దేవస్థానం అధికారులకు తెలియడంతో ఇప్పటికే అధికార యంత్రాంగం రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని ఏర్పాట్లపై దృష్టిసారించింది. భద్రాచలంలో రాష్ట్రపతి అరగంటపాటు ఉంటారని సమాచారం.

Updated Date - 2022-12-15T01:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising