ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఇంట్లో మొక్కలను పెంచాలి: ఎంపీడీవో

ABN, First Publish Date - 2022-07-06T05:17:24+05:30

ప్రతి ఇంట్లో మొక్కలను పెంచటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో కనపర్తి జమలారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేలకొండపల్లి, జులై5: ప్రతి ఇంట్లో మొక్కలను పెంచటం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో కనపర్తి జమలారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మండ్రాజుపల్లిలో ఇంటింటికీ మొక్కలు పంచే కార్యక్రమాన్ని సర్పంచ్‌ నెల్లూరి అనురాధతో కలిసి జమలారెడ్డి ప్రారంభించారు.  పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలు పెంచటం తప్పనిసరన్నారు. మొక్కలను పెంచటం ద్వారా పర్యావరణాన్ని రక్షించటంతో పాటుగా కాలుష్యాన్ని సైతం పారద్రోలవచ్చన్నారు. కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్‌ నెల్లూరి లీలాప్రసాద్‌, సర్పంచ్‌ నెల్లూరి అనురాధ, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీఓ శివ, ఏపీఓ సునీత, ఈసీ శేషగిరి, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మంఖానాపురంహవేలి: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అప్పుడే మానవాళి మనుగడకు ముప్పు ఉండదని పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌ కాట్ల అన్నారు. మంగళవారం పీజీ కళాశాలలో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో ముందుం డాలన్నారు. మొక్క నాటడమే కాకుండా దాని సంరక్షణ కూడా తీసుకోవాలన్నారు. కళాశాల ఆవరణలో వివిధ రకాల పండ్లు, పూలమొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు టి.గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising