ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ వైపే ప్రజలు

ABN, First Publish Date - 2022-12-16T01:32:16+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ఈ క్రమంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్‌ వైపే ఉండి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికలెప్పుడొచ్చినా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు

భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ మాదే విజయం

‘ఆంధ్రజ్యోతి’తో భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాచలం, డిసెంబరు 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ఈ క్రమంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్‌ వైపే ఉండి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తెలిపారు. ఇక తొలినుంచి పార్టీలో క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తున్నాననే విశ్వాసం ఉండటంతోనే అధిష్ఠానం తనకు రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందన్న ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపే ప్రధాన లక్ష్యం

మరో అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని లక్ష్యం దిశగా సాగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో ప్రజల ఆశలను వమ్ము చేశాయి. దీంతో ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఏకీకరణతోనే గెలుపుబాట

పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీని అస్థిరపరచాలని చూసే ఎంతటి నాయకులనైనా సహించేది లేదు. జిల్లాలో కొన్నిచోట్ల గ్రూపులు, ఆధిపత్యపోరు ఉన్నా వాటిని సరిదిద్దుకుంటాం. జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులను ఏకీకరణ చేసి ఎన్నికల్లో సమష్టిగా పోరాడుతాం.

రాజకీయ ఎత్తుగడల్లో భాగమే తప్పుడు ప్రచారాలు

కాంగ్రెస్‌ అంటే నాకు ఎంతో ప్రేమ. నాకు ఈ స్థాయిని, హోదాని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే.. నేను పార్టీని వీడాలనుకుంటే 2018లో భద్రాచలం సీటు కేటాయించినప్పుడే వీడేవాడిని. కానీ పార్టీ అంటే విశ్వాసం, అంకితభావం ఉండటంతో ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటా. నేను ములుగులో అధికార పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ ఎత్తుగడల్లో భాగమే. అదంతా తప్పుడు ప్రచారం.

నాలుగేళ్ల పదవీకాలంలో సంతృప్తి లేదు

నిజంగానే ఈసారి నాకు నాలుగేళ్ల ఎమ్మెల్యే పదవీకాలంపై సంతృప్తి లేదు. ఎందుకంటే అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు తీసుకెళ్లిన ప్రతిపాదనలకు ఆమోద ం తెలుపరు. గతంలో ఉమ్మడి రాష్ట్ర హయాంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ప్రతిపక్ష కాంగ్రె్‌సలో ఉన్నా నాకు కలిసేందుకు అవకాశం కల్పించేవారు. మా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. రాషా్ట్రన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విపలమైంది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు. పార్టీ మారితేనే అభివృద్ధి పనులు చేపడతామనడం భావ్యం కాదు.

ఐదు పంచాయతీల విషయంలో ప్రయత్నలోపం లేదు

ఐదు పంచాయతీల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ తమిళసైలను కలిసి స్థానిక సమస్యలను వారి దృష్టికి తెచ్చి మా ప్రతినిధి బృందంతో కలకిసి విన్నవించాం. అంతే కాదు అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించా. ప్రయత్న లోపం లేకుండా పనిచేశా.. కానీ పని జరగలేదు.

ఉద్దేశ్యపూర్వకంగానే అవినీతి ఆరోపణలు

దళితబంధు యూనిట్ల గుర్తింపులో తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రజాబలం ముందు వాళ్లు సరిపోరనే దుగ్దతో బట్టగాల్చి మీద వేస్తున్నారు. దళితబంధుపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేనేంటో ప్రజలకు తెలుసు. నా నిబద్దత వారు గుర్తించారు. నా వ్యక్తిత్వమే రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తుంది.

Updated Date - 2022-12-16T01:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising