రాజకీయ వేదికగా పెద్దమ్మతల్లి ఆలయం!
ABN, First Publish Date - 2022-10-07T05:30:00+05:30
ప్రతి ఏటా మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని భక్తుల విరాళాల రూపంలో తెచ్చిపెడుతున్న దేవాలయంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే విశిష్టమైన పెద్దమ్మతల్లి దేవాలయం ప్రస్థుతం రాజకీయ వేధికగా కనిపిస్తుంది.
నత్తనడకన అభివృద్ధి పనులు
ఈవో వర్సెస్ దేవస్థాన పాలక మండలి
ఈవో ప్రేక్షక పాత్ర ?
రేపటితో ముగియనున్న కమిటీ పదవీకాలం
పాల్వంచ,అక్టోబరు 7: ప్రతి ఏటా మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని భక్తుల విరాళాల రూపంలో తెచ్చిపెడుతున్న దేవాలయంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే విశిష్టమైన పెద్దమ్మతల్లి దేవాలయం ప్రస్థుతం రాజకీయ వేధికగా కనిపిస్తుంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా అది రాజకీయమే అవుతుంది. దేవాలయంలో రంగులు వేయించే విషయం నుంచి చివరకు అర్చకులు దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలూ రాజకీయమయ్యాయి. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు చేసుకు పోతున్నారు. విది విధానాలు లేవు, లెక్కా పత్రం లేదు.తీసుకునే తీర్మానాలకు అర్దం లేదు, వాటిని దేవాదాయ కమిషనర్‌కు పంపి చేతులు దులుపు కోవడం తప్ప చేసేదేమీ లేదు.
శివాలయ నిర్మాణంలో..
పెద్దమ్మతల్లి ఆలయ ప్రారంగణంలోనే శివాలయ నిర్మాణం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయానికి దాత పేరును ప్రకటించి అతను రూ.30 లక్ష లు విరాళంగా ఇస్తున్నట్లు, మిగిలిన రూ.74 లక్షలు దేవాలయ ఫండ్‌నుంచి ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నారు. హడావిడిగా శివాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ దేవస్థానంలో జరుగుతున్న రాజకీయాలతో ఆ పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో అందరూ అసహనంతో ఉన్నారు. ముందుగా ప్రకటించినట్లుగా దాత పేరున కాకుండా వేరొకరి పేరున తీర్మానం చేసి అనుమతుల కోసం పంపించారు.అంతే కాక మిగిలిన రూ.74లక్షలకు పెద్దమ్మతల్లి దేవస్థానం ప్రాకార మండ పం కోసం సేకరించిన విరాళాలు రూ.23లక్షలను శివాలయ నిర్మాణానికి వినియోగించేలా అనుమతులు మం జూరు చేయాలని, తీర్మానాలను పంపారు. ఇక్కడే శివాలయం ఫైల్ పెండింగ్‌లో పడింది. వాస్తవంగా భక్తులు విరాళలు ఇచ్చింది పెద్దమ్మతల్లి ఆలయ ప్రకార మండపం నిర్మాణం కోసం. కానీ తీర్మానాలు చేసింది శివాలయ నిర్మాణానికి కావడంతో నేటికీ శివాలయ నిర్మాణానికి రావలసిన అనుమతులు రాకపోవడం,.శాఖ అనుమతులు లే కుండానే అన్నీ పనులు జరుగుతుండటం, అన్నీ రాజకీయ పరంగా కొనసాగుతుండటంతో అసలు ఇక్కడ ఈఓ ఉన్న ట్లా, లేనట్లా, లేదంటే ఆలయం దేవాదాయశాఖ పాలన కింద ఉన్నట్లా, లేనట్లా,అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈవో వర్సెస్ పాలకమండలి..
ఆలయ ప్రాంగణంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఫంక్షన్‌హాల్స్ నిర్మాణాలు పూర్తయినా ఇంకా ప్రారంభించక పోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఓ -పాలకమండలి వివాధాలతో ఫంక్షన్‌హాల్స్ నిరుపయోగంగా మారాయి. దీంతో నెలకు లక్షల్లో దేవాలయ ఆదాయానికి గండి పడుతుంది. శివాలయ నిర్మాణం పేరుతో లక్షల ఆదాయం తెచ్చి పెట్టే అద్దెగదులను కూ ల్చివేయడంపై కేశవాపురం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్‌హాల్స్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న లక్షల విలువైన టేకు చెట్లను ఎవరి అనుమతులు తీసుకోకుండానే నరికి వచ్చిన ఆదాయాన్ని పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ అర్చకులు ఊరేగింపు తరువాత అమ్మవారికి అభిషేకం చేయడం ఆనవాయితీ.కానీ ఈసారి ఆ కార్యక్రమం నిర్వహంచకుండానే ముగించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓను నిలదీశారంటే పరిస్థితి ఏవిదంగా ఉందో ఇట్టే అర్దమౌతుంది. పైగా అబిషేకం చేయడానికి నూతనంగా డబ్బులు వెచ్చించి ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉంది.
రేపటితో ముగియనున్న పాలక మండలి పదవీకాలం
గత సంవత్సరం ఏర్పాటు చేసిన పాలకమండలి పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. గతంలో పాలకమండలి ఏర్పాటులోనూ అధికారంకంటే రాజకీయమే పైచేయిగా నిలిచిందని చెప్పవచ్చు. నిబంధనలను తుంగలో తొక్కి మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,లేడీ రిజర్వేషన్లకు మంగళం పాడారు. గుడిలోని ఒక అర్చకుడు మండలిలో తప్పనిసరిగా ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఉండాలి. 14 మందితో ఉండాల్సిన మండలి 12 మందితోనే కొనసాగింది. గుడికి ఎటువంటి సంబందం లేని వారికే మండలిలో చోటు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివారంతో పాలకమండలి పదవీకాలం ముగియనుండటంతో ఈ సా రి పాలక మండలిలో పేర్లు మారతాయనే ప్రచారం ఊ పందుకుంది. వారిలో ఇద్దరిని పక్కకు పెట్టి కొత్తవారిని తీ సుకోవాలని తీర్మానించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా దే వాదాయశాఖ అధికారులు దేవస్థానంలో చోటుచేసుకుంటున్న సంఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిం చి రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు,అభివృద్ది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.
ఫఈ విషయాలపై ఆలయ ఈవో సులోచనను ‘అంధ్రజ్యోతి’ వివరణ కోరగా మొదట దాతగా ఉన్న వ్యక్తి అందుబాటులో లేకపోడవడంతో వేరే దాత పేరున అనుమతులకోసం ప్రపోజల్స్ పంపించిన మాట వాస్తవమేనని,నేటికీ అనుమతులు రాలేదని అన్నారు.
Updated Date - 2022-10-07T05:30:00+05:30 IST