ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు గ్రామాల్లో పశువులకు దాన పంపిణీ

ABN, First Publish Date - 2022-08-18T03:12:51+05:30

ఇటీవల గోదావరి వరదల వల్ల ముంపునకు గురై న గ్రామాల్లో పశువులకు దానా పంపిణీ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ అధ్వ ర్యంలో బుధవారం జరిగింది.

దాణాను పంపిణీ చేస్తున్న విప్‌ రేగా, కలెక్టర్‌ అనుదీప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరు, ఆగస్టు 17:  ఇటీవల గోదావరి వరదల వల్ల ముంపునకు గురై న గ్రామాల్లో పశువులకు దానా పంపిణీ  కార్యక్రమం పశుసంవర్ధక శాఖ అధ్వ ర్యంలో బుధవారం జరిగింది. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని గోదావరి వరద ముంపు గ్రామాలైన అన్నారం, బెస్తగూడెం, చిన్న రావిగూడెంలలో ముం పునకు గురైన పశుపోషకుల జాబితాను పశు వైద్య సిబ్బంది సర్వేద్వారా సేకరించారు.  ఈ క్రమంలో బుధ వారం అన్నారం గ్రామంలో కలెక్టర్‌ అనుదీప్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావులు ముఖ్య అతిధులుగా పాల్గొని స్ధానిక పశు వైద్య శాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాడి రైతులకు దాన అంద జేశారు. ఈ కార్యక్రమం వరద ముంపు గ్రామాల్లో పాడిరైతులకు అమలు చేస్తామని పశువైద్య అధికారి శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీఏహెచ్‌వో పురేందర్‌, సత్య ప్రసాద్‌, అశ్వాపురం మణుగూరు, పినపాక వైద్యులు, మణు గూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సోసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు జావెద్‌ పాషా, రైతులు పాల్గొన్నారు.

అశ్వాపురంలో..

బూర్గంపాడు: మండలంలోని వరదముంపు ప్రాంతాల రైతులకు జిల్లా కలెక్టర్‌ నిధుల నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు దాణా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ముంపు ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత పై గత నెల 27న ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యింది. దీనికి స్పందించిన ప్రభుత్వం పశుగ్రాసం కొరతపై ఇటీవల ఆరాతీసింది. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండటంతో కలెక్టర్‌ నిధుల నుంచి పశువులకు దాణా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పశువైద్య కేంద్రంలో జెడ్పీటిసి కామిరెడ్డి శ్రీలత బూర్గంపాడు రైతులకు ఉచిత పశుదాణాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సిరిపురపు స్వప్న, బూర్గంపాడు ఏడిఏ ఠాగూర్‌, పశువైద్యాధికారి రవీందర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T03:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising