ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రగతి.. చేతల్లో వికృతి

ABN, First Publish Date - 2022-06-25T04:43:43+05:30

పంచాయతీల్లో ఈనెల మూడు నుంచి 18వరకు అంటే పక్షం రోజుల పాటు పల్లె ప్రగతి పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు.

గాండ్లగూడెంలో అడవిని తలపిస్తున్న పార్క్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాండ్లగూడెం, బచ్చువారిగూడెంలో అడవులను తలపిస్తున్న పార్క్‌లు

పక్షం రోజుల్లో గడ్డి మొక్కను కూడా తొలగించని వైనం

అశ్వారావుపేట రూరల్‌, జూన్‌ 24: పంచాయతీల్లో ఈనెల మూడు నుంచి 18వరకు అంటే పక్షం రోజుల పాటు పల్లె ప్రగతి పేరుతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్వాహణకు పంచాయతీల్లో పనులను బట్టి రూ.లక్షల్లోనే ఖర్చు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా పల్లె ప్రజలకు సాయంత్రం వేళ్ల ఆహ్లాదాన్ని కలిగించేందుకు ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు పెట్టి పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. పార్క్‌లలో రకరకాల మొక్కలను నాటి రక్షణ చర్యలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వహణ మాత్రం శూన్యంగానే ఉంటుంది. మామూలు రోజులు పక్కన పెట్టినా పల్లె ప్రగతి సమయంలోనైనా పార్క్‌లను అందంగా తయారుచేసిన పంచాయతీ అధికాలు పార్కులు మావికావులే అన్నట్లుగా వదిలేశారు. మండలంలోని గాండ్లగూడెం, బచ్చువారిగూడెం పంచాయతీలోని ఆసివారిగుంపు సమీపంలోని పల్లె ప్రకృతివనాలు అడవులను తలపిస్తున్నాయి. గాండ్లగూడెంలో అయితే అసలు ఇది పార్క్‌నేనా అనే మాదిరిగా తయారైంది. గ్రామానికి దగ్గరలో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను సుందరంగా తయారుచేస్తే ప్రజలు అటుగా వెళ్లటానికి అవకాశం ఉంటుంది. కాని పార్క్‌ పిచ్చిచెట్లు, గడ్డితో మొత్తం అడవిలా తయారైంది. సాధారణంగా అయితే పార్క్‌లో నడిచేందుకు రహదారిని కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అటువంటిదేవిలేదని సరదాగా అటుగా వెళ్లిన ముళ్లకంపల్లో నడిచే పరిస్థితి కూడా లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇక బచ్చువారిగూడెం పంచాయతీలోని పార్క్‌లో కూడా గడ్డి విపరీతంగా పెరిగింది. పక్షం రోజులు వివిధ పనులు చేపట్టిన అధికారులు పార్క్‌ల్లో మాత్రం గడ్డిని కూడా తొలిగించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంలో ఏర్పాటు చేసిన పార్క్‌లు అధికారుల తీరుతో వృథాగా పడి ఉంటున్నాయని వాపోతున్నారు. పంచాయతీల్లో నిధులు నీళ్లలా కరుగుతున్నా ప్రజలకు ఆహ్లాదం మాత్రం అందని ద్రాక్షగానే మిగులుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అడువుల్లా పార్క్‌లను సుందరంగా తయారు చేయాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-06-25T04:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising